Anna Canteen: అన్నా క్యాంటిన్ ఏర్పాటు పై వివాదం.. ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందని తొలగించమన్న మున్సిపల్ సిబ్బంది

గత 20 రోజుల క్రితం తెనాలి మార్కెట్ సెంటర్ లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశారు. 20 రోజులుగా పేదలకు ఉచితంగా అన్నదానం చేస్తున్నారు.

Anna Canteen: అన్నా క్యాంటిన్ ఏర్పాటు పై వివాదం.. ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందని తొలగించమన్న మున్సిపల్ సిబ్బంది
Anna Canteen Tenali
Follow us
Surya Kala

|

Updated on: Sep 02, 2022 | 7:22 AM

Anna Canteen: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తెనాలిలో అన్నా క్యాంటిన్ ఏర్పాటు పై వివాదం నెలకొంది.  టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ పై ఆంక్షలు విధించారు మున్సిపల్ అధికారులు. అంతేకాదు మున్సిపల్ స్థలంలో కాకుండా ప్రైవేట్ స్థలంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి ఉచిత భోజనం పెట్టాలని సూచించారు. దీంతో మున్సిపల్ అధికారులకు, టీడీపీ శ్రేణులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. గత 20 రోజుల క్రితం తెనాలి మార్కెట్ సెంటర్ లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశారు. 20 రోజులుగా పేదలకు ఉచితంగా అన్నదానం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మున్సిపల్ అధికారులు గురువారం అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్న స్థలంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలతో మున్సిపల్ స్థలంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను తొలగించి వేరే ప్లేస్ లో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

దీంతో టీడీపీ, మున్సిపల్ అధికారుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ట్రాఫిక్ కు అంతరాయంగా వుంది అందువల్ల అన్నా క్యాంటీన్ తీసివేయాలి అని  మున్సిపల్ అధికారులు సూచించారు. అయితే మధ్యాహ్నం కేవలం ఒక గంట వ్యవధిలోపే అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ తీసేయమనడం దారుణం మని టీడీపీ నేతలు వాపోతున్నారు. అన్నా క్యాంటీన్ పై వివక్షత తగదని టీడీపీ శ్రేణులు అంటున్నాయి.

Reporter: T. Nagaraju, TV9 Telugu

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..