Andhra Pradesh: సంచిలో చుట్టుకుని వెళ్లింది.. గుంటూరు ఆసుపత్రిలో పసిబిడ్డను ఎత్తుకెళ్లిన మహిళ ఈమె..

|

Oct 04, 2023 | 12:57 PM

గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరు రోజుల శిశువు అపహరణకు గురవ్వడం కలకలం రేపుతోంది. తల్లి పక్కలో ఉన్న పసి పాపను గుర్తు తెలియని మహిళ అపహరించుకెళ్లింది. గుంటూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు ఐపిడి కాలనీకి చెందిన రబ్బానీ భార్య రోష్నిని డెలివరీ కోసం గత నెల 26వ తేదిన జిజిహెచ్‌లో చేర్పించాడు. 27వ తేదిన ఆమెకు సిజేరియన్ చేయగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

Andhra Pradesh: సంచిలో చుట్టుకుని వెళ్లింది.. గుంటూరు ఆసుపత్రిలో పసిబిడ్డను ఎత్తుకెళ్లిన మహిళ ఈమె..
Ap Crime News
Follow us on

గుంటూరు, అక్టోబర్ 04: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరు రోజుల శిశువు అపహరణకు గురవ్వడం కలకలం రేపుతోంది. తల్లి పక్కలో ఉన్న పసి పాపను గుర్తు తెలియని మహిళ అపహరించుకెళ్లింది. గుంటూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు ఐపిడి కాలనీకి చెందిన రబ్బానీ భార్య రోష్నిని డెలివరీ కోసం గత నెల 26వ తేదిన జిజిహెచ్‌లో చేర్పించాడు. 27వ తేదిన ఆమెకు సిజేరియన్ చేయగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, మంగళవారం మధ్యాహ్నం మహిళ.. భర్త ఆహారం తీసుకువచ్చేందుకు బయటకు వెళ్లాడు. ఈ సమయంలో తల్లి పక్కలో పసిపాప ఉంది. అయితే, తల్లి నిద్రపోవటాన్ని గమనించిన మహిళ తల్లి పక్కలో ఉన్న శిశువును ఎత్తుకెళ్లింది. మేల్కొన్న తల్లి పక్కలో శిశువు లేకపోవడాన్ని గమనించి వెంటనే భర్తకు చెప్పింది. భార్య భర్తలు వెంటనే కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రంగంలోకి దిగిన పోలీసులు జిజిహెచ్‌లో సిసి కెమెరా విజువల్స్ పరిశీలించగా.. గుర్తు తెలియని మహిళ పసిపాపను తీసుకెళ్ళినట్లు గుర్తించారు. ఓ మధ్యవయస్కురాలు పసికందును తీసుకుని ఆటో రిక్షాలో వెళ్లినట్లు గుర్తించారు. జీజీహెచ్‌ నుంచి బయటకు వెళ్ళే సమయంలో అనుమానం రాకుండా మహిళ బిడ్డను సంచిలో పెట్టుకుంది. ఆ తర్వాత ఆటో ఎక్కినట్లు పోలీసులు తెలిపారు.

ఈ మేరకు మహిళా ఫోటోలను కొత్తపేట పోలీసులు విడుదల చేశారు. మహిళతోపాటు.. ఆమె ఎక్కిన ఆటోను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. మహిళను గుర్తించేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆటోను ట్రాక్‌ చేసి.. మహిళను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

గతంలోనూ జిజిహెచ్‌లో పసిపిల్లల అపహరణ జరిగిన ఘటనలు ఉన్నాయి. అయితే జిజిహెచ్‌లో ప్రైవేటు సెక్యూరిటీ గార్డులను నియమించడంతో కొంతమేరకు శిశువుల అపహరణకు అడ్డుకట్ట పడింది. అయితే తిరిగి శిశువు అపహరణతో జిజిహెచ్‌లో చిన్న పిల్లలపై భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రతను పెంచారు. ఇలాంటి ఘటనలు మున్ముందు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..