AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: కార్తీకమాసం ఆఖరి సోమవారం ముందు అద్భుతం.. శివయ్యకు పూజలు చేసిన నాగుపాము.. వీడియో

ఆలయాల్లో నాగుపాము దర్శనమిస్తే భక్తులు దైవ మహిమగా భావిస్తుంటారు.. అలాంటిది కార్తీక మాసంలో.. అందులోనూ శివాలయంలో నాగుపాము దర్శనమిస్తే భక్తులు.. స్వయంగా దేవుని మహిమగా పేర్కొంటారు.. అంతేకాకుండా ఆ ఆలయానికి చేరుకుని.. పూజలు చేయడంతోపాటు.. ప్రదక్షిణలు చేస్తారు. అచ్చం అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది.

Andhra: కార్తీకమాసం ఆఖరి సోమవారం ముందు అద్భుతం.. శివయ్యకు పూజలు చేసిన నాగుపాము.. వీడియో
Nellore Temple Miracle
Ch Murali
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Nov 17, 2025 | 10:55 AM

Share

ఆలయాల్లో నాగుపాము దర్శనమిస్తే భక్తులు దైవ మహిమగా భావిస్తుంటారు.. అలాంటిది కార్తీక మాసంలో.. అందులోనూ శివాలయంలో నాగుపాము దర్శనమిస్తే భక్తులు.. స్వయంగా దేవుని మహిమగా పేర్కొంటారు.. అంతేకాకుండా ఆ ఆలయానికి చేరుకుని.. పూజలు చేయడంతోపాటు.. ప్రదక్షిణలు చేస్తారు. అచ్చం అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెర్లోపల్లి విశ్వనాథ స్వామి ఆలయంలో ఆదివారం నాగుపాము భక్తులకు దర్శనమిచ్చింది.. ఆలయానికి వచ్చిన భక్తులు నాగుపామును చూసి పూజలు చేశారు. అనంతరం కాసేపటికి తిరిగి పొట్టలోకి వెళ్లిపోయినట్టు భక్తులు, ఆలయ అర్చకులు చెబుతున్నారు..

కార్తికమాసం సందర్భంగా విశేష పూజలు నిర్వహిస్తున్నామని, అదే సమయంలో నాగుపాము సాక్షాత్తూ శివుడి దగ్గరకు చేరుకొని పడగ విప్పిందని.. ఆలయ అర్చకుడు శ్రీనివాసులు వివరించారు. ఇది దేవుని మహిమగా వివరించారు.

వీడియో చూడండి..

దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా.. ఆఖరి సోమవారానికి ముందు నాగు పాము శివయ్య పూజలు చేసిందన్న విషయం తెలుసుకుని.. భక్తులు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకుని శివుడికి పూజలు చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..