Cabinet Secretariat Jobs 2025: కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఈ అర్హతలుంటే జాబ్ గ్యారెంటీ
Cabinet Secretariat DFO Recruitment 2025 Notification: డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన గ్రూప్-బి (నాన్ గేజిటెడ్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 250 డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ (టెక్నికల్) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను 2023, 2024, 2025 సంవత్సరాల్లో గేట్‌లో..

భారత ప్రభుత్వానికి చెందిన కేబినెట్ సెక్రటేరియట్.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన గ్రూప్-బి (నాన్ గేజిటెడ్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 250 డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ (టెక్నికల్) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను 2023, 2024, 2025 సంవత్సరాల్లో గేట్‌లో సాధించిన స్కోర్ ఆధారంగా భర్తీ చేయనుంది. అర్హత గల కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 14, 2025వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
సబ్జెక్టుల వారీగా పోస్టుల వివరాలు ఇలా..
- కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పోస్టుల సంఖ్య: 124
- డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్‌లో పోస్టుల సంఖ్య: 10
- ఎలక్ట్రానిక్స్ అండ్ అండ్/ లేదా కమ్యూనికేషన్/టెలికమ్యూనికేషన్‌లో పోస్టుల సంఖ్య: 95
- సివిల్ ఇంజినీరింగ్‌లో పోస్టుల సంఖ్య: 02
- మెకానికల్ ఇంజినీరింగ్‌లో పోస్టుల సంఖ్య: 02
- ఫిజిక్స్‌లో పోస్టుల సంఖ్య: 06
- కెమిస్ట్రీలో పోస్టుల సంఖ్య: 04
- మ్యాథమెటిక్స్‌లో పోస్టుల సంఖ్య: 02
- స్టాటిస్టిక్స్‌లో పోస్టుల సంఖ్య: 02
- జియోలజీలో పోస్టుల సంఖ్య: 03
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ లేదా టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా పైన పేర్కొన్న ఏదైన ఒక సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే గేట్ 2023, 2024, 2025 ఏదైనా ఒక సంవత్సరం వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 30 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు ఎవరైనా ఆఫ్‌లైన్ విధానంలో డిసెంబర్ 14, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. గేట్ స్కోర్, ఇంటర్వ్యూ, ద్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. నింపిన ఆఫ్‌లైన్ దరఖాస్తులను పోస్టు ద్వారా లోధీ రోడ్, హెడ్ పోస్ట్ ఆఫీస్, న్యూఢిల్లీ అడ్రస్‌కు పోస్టు ద్వారా పంపించాలి. ఎంపికైన వారికి నెలకు రూ.99,000 జీతంతోపాటు ఇతర అలవెన్స్‌లు కల్పిస్తారు. త్వరలో విడుదలయ్యే పూర్తి నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింది అధికారిక వెబ్‌సైట్ లింక్‌లో చెక్ చేసుకోవచ్చు.
అధికారిక వెబ్‌సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




