నెల్లూరు నగర తెదేపా ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులుకు తృటిలో ప్రమాదం తప్పింది. వేగంగా దూసుకువచ్చిన కారుతో గుద్ది రాజశేఖర్ రెడ్డి అనే యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. బాలాజీనగర్‌లోని కోటంరెడ్డి ఇంటివద్ద రోడ్డు మీద ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. ఆయన కుమారుడుప్రజయ్స్నేహితుడు రాజశేఖర్ రెడ్డి ఇంటికి వచ్చి గొడవకు దిగాడని కోటంరెడ్డి బంధువులు చెప్పారు. తాగి ఇంటికి వచ్చి గొడవ చేశాడని, సర్ధి చెప్పి బయటకు పంపించామని వివరించారు. తాగిన మైకంలో కారుతో కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిని ఢీ కొట్టి పరారయ్యాడని కుటుంబసభ్యులు అంటున్నారు. ఈ ఘటనలో కోటంరెడ్డి రోడ్డుపై పడిపోయారు. దీంతో అలర్ట్ అయిన కుటుంబసభ్యులు చికిత్స కోసం అపోలో ఆసుపత్రిలో చేర్చారు. కోటంరెడ్డిని పరీక్షించిన వైద్యులు.. ఆయన కాలుకు ఫ్యాక్చర్ అయినట్లు గుర్తించారు. చికిత్స కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారైన రాజశేఖర్ రెడ్డి కోసం గాలిస్తున్నారు.
ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రియాక్ట్ అయ్యారు. జగన్ రెడ్డి గారి మూడు రాజధానులకు తోడు క్రైమ్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా నెల్లూరును ప్రకటించినట్టు ఉందని విమర్శించారు. నెల్లూరు సిటీ టీడీపీ ఇంచార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని కారుతో ఢీకొట్టి హత్యాయత్నం చేయడం దారుణమన్న లోకేశ్.. దాడికి పాల్పడిన వైసీపీ సానుభూతిపరుడు సైకో రాజశేఖరరెడ్డిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి