Sriharikota-Covid: ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. సతీష్ ధవన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (షార్)లో మళ్లీ కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఒక్కసారిగా యజమాన్యం ఉల్కిపడింది. తాజాగా షార్ లోని 14 మంది కి కరోనా నిర్ధారణ అయింది. గత నెల డిసెంబర్ నుంచి షార్ లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే షార్ లోని పనిచేస్తున్న సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా కరోనా బారినపడినల్టు తెలుస్తోంది. అంతేకాదు ఓ డాక్టర్ కుటుంబానికి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో అక్కడ అలజడి నెలకొంది. అయితే కొంతమంది ఒమిక్రాన్ అయి ఉండొవచ్చు అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
డిసెంబర్ 27న ఇద్దరికి కరోనా పాజిటివ్ రాగా.. ఆదివారం ఒకరు కరోనా బారినపడినట్టు సమాచారం. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన షార్ ఉద్యోగులు హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. సూళ్లూరుపేటలోని షార్ ఉద్యోగుల కేఆర్పీ, డీఆర్డీఎల్ లో ఒక్కొక్కరుగా కరోనా బారినట్లు పడినట్లు తెలుస్తోంది. ఇక షార్ రిటైర్డ్ ఉద్యోగికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో షేర్ ఉద్యోగుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
Also Read: