Andhra Pradesh: నెల్లూరులో చిన్నారి అపహరణ.. గంటల వ్యవధిలోనే చేధించిన పోలీసులు..

|

Jan 18, 2022 | 12:59 PM

Andhra Pradesh: నెల్లూరు జిల్లాలో అపహరణకు గురైన చిన్నారిని గంటల వ్యవధిలో కనిపెట్టారు. చిన్నారిని ఎత్తుకెళ్లిన దండుగుడిని పోలీసులు

Andhra Pradesh: నెల్లూరులో చిన్నారి అపహరణ.. గంటల వ్యవధిలోనే చేధించిన పోలీసులు..
Follow us on

Andhra Pradesh: నెల్లూరు జిల్లాలో అపహరణకు గురైన చిన్నారిని గంటల వ్యవధిలో కనిపెట్టారు. చిన్నారిని ఎత్తుకెళ్లిన దండుగుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకెళితే.. నెల్లూరులోని గుప్తా పార్క్ వద్ద 9 చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తి అపహరించుకుపోయాడు. చిన్నారి తల్లి ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో.. చిన్నారిని అమ్మమ్మ, తాతల వద్ద వదిలేసి వెళ్లిపోయాడు తండ్రి శీనయ్య. దాంతో ఆ అవ్వా, తాత పార్కు వద్ద భిక్షాటన చేస్తూ చిన్నారిని సాకుతున్నారు. అయితే, నిన్న రాత్రి నిద్రిస్తున్న సమయంలో చిన్నారిని ఓ దుండగుడు కిడ్నాప్ చేశాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో.. వెంటనే రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు సంతపేట పోలీసులు. సీసీ కెమెరాలో రికార్డైన అపహరణ దృశ్యాల ఆధారంగా విచారించారు. గంటల వ్యవధిలోనే కిడ్నాపర్‌ను పట్టుకుని చిన్నారిని క్షేమంగా కాపాడారు. నిందితుడు తిరుపతిలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. అక్కడ అతన్ని పట్టుకుని చిన్నారిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పాపను అమ్మమ్మ, తాతలకు అప్పగించారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Also read:

Vijayawada: విజయవాడ శిఖామణి సెంటర్‌లో మహిళ మృతి.. హత్యాచారమా?, ప్రమాదా?..

Ola Electric Scooter: ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్ కొనుగోలుదారులకు షాకింగ్‌.. లబోదిబోమంటున్న కస్టమర్లు

Minister Harish Rao: వ్యాక్సీన్ వ్యవధి తగ్గించండి.. కేంద్ర మంత్రికి లేఖ రాసిన మంత్రి హరీష్ రావు..