ఏఓ హత్య కేసులో నిర్లక్ష్యం..పోలీస్ స్టేషన్‌ సిబ్బంది మొత్తం ఒకేసారి బదిలీ.. జిల్లా ఎస్పీ సంచలన నిర్ణయం

రాష్ట్ర పోలీసు శాఖ చరిత్రలోనే సంచలన నిర్ణయం నెల్లూరు జిల్లాలో జరిగింది.. విచారణ లో నిర్లక్ష్యం.. బాధితులకు కాకుండా నేరస్తులకు వత్తాసు పలికిన సందర్భాల్లో.. విధుల్లో అలసత్వం జరిగిన సందర్భాల్లో పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవడం చూసే ఉంటాం.. కానీ ఒక పోలీసు స్టేషన్ లో ఉండే సిబ్బంది మొత్తం పై ఒకే సారి చర్యలు తీసుకోవడం తొలిసారిగా నెల్లూరు జిల్లాలో జరిగింది.. జిల్లా ఎస్పి అనిత వేజెండ్ల ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు..

ఏఓ హత్య కేసులో నిర్లక్ష్యం..పోలీస్ స్టేషన్‌ సిబ్బంది మొత్తం ఒకేసారి బదిలీ.. జిల్లా ఎస్పీ సంచలన నిర్ణయం
Police Station Staff Transf

Edited By:

Updated on: Jul 13, 2026 | 9:13 PM

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండల వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్న శ్రీహరిని ఆస్తి కోసం సొంత బావమరిదే హత్య చేశాడు.. చేయాల్సిందంతా చేసి సాధారణ మృతిగా కుటుంబ సభ్యులను నమ్మించాడు.. బుచ్చి రెడ్డి పాలెం వ్యవసాయ శాఖ అధికారి శ్రీహరి తన బావమరిది హరిక్ష్రిష్ణకు డబ్బు అప్పుగా ఇచ్చాడు.. ఆ డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు సొంత చెల్లి భర్త బావను హతమార్చాడు.. ఎవ్వరికీ అనుమానం రాకుండా కుక్కలను చంపే ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసినట్లు పోలీసులు విచారణ లో బయటపడింది. ఈ కేసులో బావమరిది పరారీలో ఉండగా, ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

గత నెల 15న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వ్యవసాయ అధికారిది హత్యగా నిర్ధారించారు. శ్రీహరి తన సొంత బావమరిది హరికృష్ణను నమ్మి కోట్ల విలువైన ఆస్తిని అతనికి రాసిచ్చారు. అప్పుగా కొంత డబ్బును ఇచ్చారు. ఈ క్రమంలో శ్రీహరి ఇల్లు కట్టుకోవాలని ఉందని, తాను ఇచ్చిన ఆస్తిని, డబ్బులు తిరిగి ఇవ్వాలని హరికృష్ణ కోరారు. దీంతో ఏమాత్రం ఇష్టంలేని అతను బావను హత్య చేసేందుకు ప్రణాళిక వేశాడు. ఇందుకు మరో ఇద్దరిని నియమించుకున్నాడు. జూన్ 15న దైవ దర్శనానికి వెళ్లి వద్దామని నమ్మించి కారులో పెంచలకోనకు తీసుకువెళ్లాడు. తిరిగి వచ్చే క్రమంలో కార్ డ్రైవ్ చేస్తున్న హరికృష్ణ పథకం ప్రకారం చేజర్ల మండలం సమీపంలో అకస్మాత్తుగా కారు ఆపాడు. అప్పటికే కాపు కాచిన గొలగముడికి చెందిన రవీంద్ర, రామతీర్థంకు చెందిన యానాదయ్యలు కారు ఆపగానే శ్రీహరిని పట్టుకున్నారు. హరికృష్ణ కుక్కలను చంపేందుకు ఉపయోగించే ఇంజక్షన్ రెండు శ్రీహరికి వేయడంతో ఆయన గుండె ఆగిపోయింది. దీంతో గుండెపోటుగా చిత్రీకరించి బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని సొంత ఊరు మినగల్లుకు తీసుకువచ్చారు.

మృతి విషయం తెలిసిన తోటి ఉద్యోగులు మృతుడి శరీరంపై గాయాలు ఉండటంతో అనుమానం వ్యక్తం చేశారు. ఆ సమయంలో పోలీసులు వచ్చిన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయలేదు. తర్వాత మృతదేహాన్ని అంత్యక్రియలో భాగంగా సహజంగా పూడ్చాలని ఆచారం ఉన్నా కూడా హరికృష్ణ ఒత్తిడి తో కాల్చేశారు. ఇటీవల హరికృష్ణ శ్రీహరికి సంబంధించి మిగిలిన ఆస్తి తనకు ఇవ్వాలని ఘర్షణ పడటంతో ఆయన భార్య లావణ్య ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీనిపై రూరల్ డీఎస్పి ఘట్టమనేని శ్రీనివాసరావు దర్యాప్తు చేపట్టి రవీంద్ర, యానాదయ్యలను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న హరికృష్ణ కోసం గాలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే పోలీసులు కేసును సీరియస్ గా తీసుకోలేదని ఆరోపణలు వచ్చాయి.. జూన్ 15 న ఘటన జరగగా ఈనెల 6 న అనుమానం ఉన్నట్లు బార్య లావణ్య జిల్లా ఎస్పి అజిత్ వేజెండ్లకు పిర్యాదు చేయగా అసలు విషయం బయటపడింది.. సీఐ శ్రీనివాస రావు కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరుపై జిల్లా ఎస్పి సీరియస్ అయ్యారు.. సీఐ తో పాటు స్టేషన్ లో పనిచేస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ సహా అందరు సిబ్బంది 23 మందిని ఒక్క సారిగా బదిలీ చేశారు.. ఆంధ్ర ప్రదేశ్ పోలీసు చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదని కొందరు సీనియర్ పోలీసు అధికారులు చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us