Nellore Nursing College: 5వ/7వ తరగతి అర్హత.. నెల్లూరు నర్సింగ్ కాలేజీలో స్వీపర్, లైబ్రరీ అటెండెంట్ ఉద్యోగాలు..

నెల్లూరులోని గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన స్వీపర్, లైబ్రరీ అటెండెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తోటీ/ స్వీపర్, లైబ్రరీ అటెండెంట్ పోస్టులకు దరాఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసిరగా అయిదు, ఏడో తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయోపరిమితి18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి..

Nellore Nursing College: 5వ/7వ తరగతి అర్హత.. నెల్లూరు నర్సింగ్ కాలేజీలో స్వీపర్, లైబ్రరీ అటెండెంట్ ఉద్యోగాలు..
Nellore Nursing College

Updated on: Aug 16, 2023 | 4:03 PM

నెల్లూరు, ఆగస్టు 16: నెల్లూరులోని గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన స్వీపర్, లైబ్రరీ అటెండెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తోటీ/ స్వీపర్, లైబ్రరీ అటెండెంట్ పోస్టులకు దరాఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసిరగా అయిదు, ఏడో తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయోపరిమితి18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్‌ విధానంలో ఆగస్టు 26, 2023వ తేదీలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా దరఖాస్తులను పంపాలి. అప్లికేషన్‌ ఫీజు కింద జనరల్‌ అభ్యర్ధులు రూ.300, ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్ధులు రూ.200 డీడీ తీసి పంపాలి. ముందుగా అధికారిక వెబ్‌సైట్‌  నుంచి అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ఆ తర్వాత దానిని పూరించి సంబంధిత డాక్యుమెంట్లను జత చేసి పోస్టులో పంపాలి.

విద్యార్హతలో సాధించిన మార్కులు, ఉత్తీర్ణులైన సంవత్సరం ఆధారంగా ఎటువంటి రాత పరీక్ష నిర్వహించకుండానే ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.15,000 వేతనంగా ఇస్తారు.

ఇవి కూడా చదవండి

అడ్రస్..

Govt College of Nursing., Nellore, S.P.S.R. Nellore District payable in Nellore, Nellore District

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.