అరవ కామాక్షి మామూల్ది కాదు.. అడ్డు చెబితే ఖతమే.. ప్రజలు ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చారంటే..

నెల్లూరులో జరిగిన సీపీఎం నేత, సామాజిక ఉద్యమ కారుడు పెంచలయ్య హత్య ఉదంతంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్థానికంగా ఉంటున్న కామాక్షి ఈ హత్య చేయించినట్లు బయట పడడం.. హత్యకు గల కారణాలు తెలుసుకున్న స్ధానికులు ఆగ్రహంతో రగిలిపోయారు. కామాక్షి కి గట్టి పనిష్మెంట్ ఇచ్చారు.

అరవ కామాక్షి మామూల్ది కాదు.. అడ్డు చెబితే ఖతమే.. ప్రజలు ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చారంటే..
Nellore Crime News

Edited By: Shaik Madar Saheb

Updated on: Dec 02, 2025 | 5:42 PM

నెల్లూరులో జరిగిన సీపీఎం నేత, సామాజిక ఉద్యమ కారుడు పెంచలయ్య హత్య ఉదంతంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్థానికంగా ఉంటున్న కామాక్షి ఈ హత్య చేయించినట్లు బయట పడడం.. హత్యకు గల కారణాలు తెలుసుకున్న స్ధానికులు ఆగ్రహంతో రగిలిపోయారు. కామాక్షి కి గట్టి పనిష్మెంట్ ఇచ్చారు. వివరాల ప్రకారం.. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ రెండు నియోజకవర్గాలు ఉన్నాయి.. ఇటీవల కాలంలో గంజాయి బ్యాచ్ లు రెచ్చిపోతున్నాయి. నగర పరిధిలో గడిచిన ఏడాదిగా వరుస హత్యలు జరిగాయి.. పట్టపగలే నగరం నడబొడ్డున కత్తులతో నరికి చంపిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఇటు అయ్యప్ప గుడి సెంటర్ నుంచి అటు బొడిగాని తోట వరకు రౌడీ బ్యాచ్‌లు పేట్రేగిపోతున్నాయి. నగరంలో పలు చోట్ల డెన్లు ఏర్పాటు చేసుకుని గంజాయి అమ్మకాలకు పాల్పడుతున్నారు..

ఇటీవల ఎన్టీఆర్ నగర్ ప్రాంతంలో గంజాయి విక్రయించే ముఠాను పోలీసులు వెంబడించగా వారిపైనే దాడులకు పాల్పడ్డారు.. దీంతో పోలీసులు కాల్పులు జరిపి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.. మొత్తంగా ఇటీవల కాలంలో దాదాపు 20 హత్యలు జరిగాయి.. గంజాయి విక్రయాలు జరుపుతున్నారని కామాక్షి పై స్థానిక సిపిఎం నేత పెంచలయ్య పలు మార్లు కంప్లైంట్ ఇచ్చారు.. ఆయన అడ్డు తగులుతున్నారన్న కారణంగా అతనిపై పది మందికి పైగా కత్తులతో నరికి చంపారు.. దీంతో నెల్లూరు నగరంలో జరుగుతున్న వరుస హత్యలు.. ఇక్కడ శాంతి భద్రతల అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని పోలీసులకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చింది.. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పెంచలయ్య హత్య కేసులో కామాక్షి సహా 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు..

వీడియో చూడండి..

2019 నుంచి కామాక్షి తీరుతో తాము అనేక ఇబ్బందులు పడ్డామని ప్రజలు చెబుతున్నారు. హౌసింగ్ బోర్డ్ కాలనీ సమీపంలోని ఆర్డిటీ కాలనీలో కామాక్షి చేస్తున్న గంజాయి అమ్మకాలపై స్థానికులు అభ్యంతరాలు చెబుతూనే ఉన్నారు.. అయినా సరే ఆమె దౌర్జన్యాలు, దాడులకు భయపడి ఎవరూ బహిరంగంగా పిర్యాదులు చేయలేని పరిస్థితి. అయితే ఒక్క పెంచలయ్య మాత్రం కామాక్షి అండ్ గ్యాంగ్ ఆగడాలకు చెక్ పెట్టాలని ప్రయత్నాలు చేశారు. గంజాయి దందా ఆపకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు.. దీంతో పెంచలయ్యపై దాడి చేసి హత్య చేశారు. కామాక్షి ఈ హత్య చేయించినట్లు తేలడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

గంజాయికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే హత్య చేయడం దుర్మార్గమని వ్యాఖ్యానించిన పలువురు స్థానికులు, టిడిపి, సిపిఎం కార్యకర్తలు కామాక్షి కి చెందిన అయిదు ఇళ్లను ధ్వంసం చేశారు. స్థానిక సీపీఎం, టీడీపీ నేతలతో కలిసి స్థానికులు ఇళ్లను కూలగొట్టారు.. ఇకపై ఈ ప్రాంతంలో కామాక్షి, అలాగే కుటుంబ సభ్యులను అడుగు పెట్టినివ్వబోమని చెప్పారు..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..