Andhra Pradesh: నరాలు తెగే ఉత్కంఠ.. శవం పాతి పెట్టారన్న సమాచారంతో పోలీసుల తవ్వకాలు.. చివరికి ట్విస్ట్

|

Feb 20, 2022 | 1:31 PM

AP News: ఇది యాజిటీజ్ దృశ్యం సినిమా సీన్. అవును నెల్లూరు జిల్లాలో దృశ్యం సినిమా మాదిరి ఘటన వెలుగుచూసింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Andhra Pradesh: నరాలు తెగే ఉత్కంఠ.. శవం పాతి పెట్టారన్న సమాచారంతో పోలీసుల తవ్వకాలు.. చివరికి ట్విస్ట్
Nellore District News
Follow us on

Nellore District: ఇది యాజిటీజ్ దృశ్యం సినిమా సీన్. అవును నెల్లూరు జిల్లాలో దృశ్యం సినిమా మాదిరి ఘటన వెలుగుచూసింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి. నెల్లూరు జిల్లా మినగల్లు(Minagallu Village)లో ఓ వ్యక్తిని మర్డర్ చేసి ఓ రైతు పొలంలో పూడ్చి పెట్టారంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఈ విషయం ఆ నోటా,  ఈ నోటా పాకి.. సోషల్ మీడియా(Social Media)కు చేరింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. వివరాలు కోసం.. సదరు రైతును పిలిచి మాట్లాడారు. అతను.. తనకే పాపం తెలియదు అన్నా సరే.. విచారణ చేయాలంటూ పోలీసులు రూల్స్‌ ప్రకారం ముందుకు వెళ్లారు. ఆ రైతును తీసుకుని పొలం వద్దకు వెళ్లారు. అయితే ఊహించని విధంగా ఆ పొలంలో ఏదో పాతిపెట్టిన ఆనవాళ్లు కనిపించాయి. దీంతో సస్పెన్స్ మొదలయ్యింది. పొలంలో శవం పాతిపెట్టారనే వార్తలు.. అక్కడ ఏదో పూడ్చి పెట్టినట్టు ఆనవాళ్లు.. దీంతో అంతా నిజంగానే మనిషిని చంపారేమో అన్న టెన్షన్‌లో ఉన్నారు. పోలీసులు ఆలస్యం చేయకుండా కూలీల సాయంతో ఆ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టారు. ఫైనల్‌గా అక్కడ ఓ కళేబరం ఉంది.. కానీ అది మనిషిది కాదు. ఓ గొర్రెపిల్ల కళేబరం. గ్రామంలో ఓ గొర్రెల కాపరికి చెందిన గొర్రెపిల్ల చనిపోగా దాన్ని అక్కడ పూడ్చిపెట్టినట్టు తెలిసింది

పోలీసులు ఆ కళేబరంపై అనుమానాలను నివృత్తి చేయడానికి పశువైద్యుల్ని ఆశ్రయించారు. మొత్తంమ్మీద అక్కడ శవం ఉందన్న వార్త.. ఆపై తవ్వకాలు జరపగా.. గొర్రెపిల్ల కళేబరం బయటపడిందన్న వార్త చుట్టుపక్కల ప్రాంతాల్లో చర్చనీయాంశమైంది.

Also Read: తిప్పతీగతో దిమ్మతిరిగే బెనిఫిట్స్.. రోజు 2 ఆకులు నమిలితే ఎన్నో ఉపయోగాలు

టెన్త్ పాస్ అయితే చాలు.. రైల్వేలో జాబ్.. ఎలాంటి రిజర్వేషన్లు లేవ్.. సోమవారమే లాస్ట్ డేట్