కరోనా సమయంలో ఆయుర్వేద మందుతో వార్తల్లో నిలిచిన నెల్లూరు ఆనందయ్య.. ఒమిక్రాన్‌కు కూడా మందు తయారు చేశానని ప్రకటించారు. దీంతో.. ఆయన నివాసముండే కృష్ణపట్నానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తరలివచ్చారు. అయితే ఆనందయ్యకు ఊహించని షాక్‌లు తగిలాయి. ఓ వైపు ఆనందయ్య మందు పంపిణీతో కరోనా వ్యాప్తి చెందే ప్రమాదముందని, మందు పంపిణీకి అనుమతి ఇవ్వొద్దంటూ కృష్ణపట్నం పంచాయతీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. మరోవైపు మందుకు ఉన్న అనుమతి ఏంటి? పంపిణీకి ఎవరు అనుమతులిచ్చారో చెప్పాలంటూ నెల్లూరు జిల్లా వైద్యాధికారులు నోటీసులు జారీ చేశారు. కాగా ఈ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించారు ఆనందయ్య. మందు పంపిణీలో పోలీసుల జోక్యాన్ని అడ్డుకోవాలంటూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఆయుర్వేద మందు కోసం తన దగ్గరకు వస్తున్న వారిని పోలీసులు అడ్డుకుంటున్నారని, దీనిని నివారించాలని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.
కాగా ఆనందయ్య పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టనుంది. జస్టిస్ డి రమేష్ ముందు దీనిపై వాదనలు విననున్నారు. కాగా గతంలోనూ హైకోర్టు సహాయంతో కరోనా మందు పంపిణీకి అనుమతి పొందారు ఆనందయ్య. ఈ సంగతి పక్కన పెడితే ఒమిక్రాన్ నివారణకు ఆయన తయారుచేసిన మందుపై రగడ కొనసాగుతూనే ఉంది. ఓ వైపు ఆ ఔషధానికి అనుమతులు లేవని ఆయుష్ చెబుతుంటే.. ఊళ్లో మందు పంపిణీ చేయొద్దంటూ కృష్ణపట్నం వాసులు ఆందోళనకు దిగారు. పంపిణీకి వ్యతిరేకంగా ఏకంగా పంచాయతీ తీర్మాణం చేపట్టారు. అంతకుముందు ఆనందయ్య ఇంటి ఎదుట గ్రామస్థులు ధర్నాకు దిగారు.
Also Read:
Viral Video: నీదేం టేస్టురా బాబూ.. మ్యాగీపై మండిపడుతున్న ఆహార ప్రియులు.. కారణమేంటంటే..