AP News: భోగాపురం ఎయిర్ పోర్టు పూర్తయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు..

|

Jul 10, 2024 | 8:07 AM

భోగాపురం ఎయిర్‌పోర్ట్.. ఉత్తరాంధ్ర వాసుల సుదీర్ఘ కల. దీనిని సాకారం చేసి తీరుతామంటోంది ఎన్డీయే సర్కార్. ఈ ఎయిర్‌పోర్ట్ ఎప్పటిలోపు పూర్తి చేయాలనే దానిపై డెడ్‌లైన్ కూడా పెట్టుకున్నారు కేంద్రమంత్రి రామానాయుడు. పౌరవిమానయాన మంత్రిగా కింజారపు రామ్మోహన్ ఉండటంతో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై ఉత్తరాంధ్రవాసులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అతి త్వరలోనే ఈ ఎయిర్‌పోర్ట్ పూర్తై అందుబాటులోకి వస్తుందని ఆశాభావంతో ఉన్నారు. వారి అంచనాలకు తగినట్టుగానే పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు.

AP News: భోగాపురం ఎయిర్ పోర్టు పూర్తయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు..
Ram Mohan Naidu
Follow us on

భోగాపురం ఎయిర్‌పోర్ట్.. ఉత్తరాంధ్ర వాసుల సుదీర్ఘ కల. దీనిని సాకారం చేసి తీరుతామంటోంది ఎన్డీయే సర్కార్. ఈ ఎయిర్‌పోర్ట్ ఎప్పటిలోపు పూర్తి చేయాలనే దానిపై డెడ్‌లైన్ కూడా పెట్టుకున్నారు కేంద్రమంత్రి రామానాయుడు. పౌరవిమానయాన మంత్రిగా కింజారపు రామ్మోహన్ ఉండటంతో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై ఉత్తరాంధ్రవాసులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అతి త్వరలోనే ఈ ఎయిర్‌పోర్ట్ పూర్తై అందుబాటులోకి వస్తుందని ఆశాభావంతో ఉన్నారు. వారి అంచనాలకు తగినట్టుగానే పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు. ఎయిర్‌పోర్ట్‌ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించిన రామ్మోహన్.. మొదటి ప్రాధాన్యతగా తీసుకుని పూర్తి చేయాలన్నారు.

విశాఖకు గుండెకాయ లాంటి భోగాపురం ఎయిర్‌పోర్టును 2026 నాటికి పూర్తి చేస్తామని ధీమా వ్యక్తంచేశారు. ఆ ఎయిర్‌పోర్ట్ పూర్తైతే ప్రత్యక్షంగా, పరోక్షంగా 6 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. ఇప్పటికే నీటి ప్రాజెక్టులు, అమరావతి, విద్యుత్ శాఖపై ఫోకస్ పెట్టిన సీఎం చంద్రబాబు, మరోవైపు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. జూలై 11న విశాఖ వెళ్తున్న సీఎం.. భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులను కూడా పరిశీలిస్తారు. ఇప్పటి వరకూ పూర్తి చేసిన పనులపై నివేదిక తీసుకోనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనులపై అక్కడి అధికారులను అడిగి మరింత సమాచారం తెలుసుకోనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను హోం మంత్రి వంగలపూడి అనిత పర్యవేక్షిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..