ఖాళీ కడుపుతో 4 నల్ల మిరియాలు చాలు..ఈ వ్యాధులు రమ్మన్నా రావు..!

16 February 2026

Jyothi Gadda

మిరియాల్లోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియాల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు సమృద్ధిగా ఉండటంతో ఆరోగ్య పరంగా ఎంతో ప్రయోజనకరం.

మిరియాల్లో ఉన్న గుణాలు ఆరోగ్య పరంగా మేలు చేస్తాయి. మిరియాల్లో జీర్ణరసాలు, ఎంజైమ్​ల ఉత్పత్తిని ప్రేరేపించి, ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.

అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులోని పైపెరిన్ అనే క్రియాశీలక సమ్మేళనం పేగుల పనితీరును మెరుగుపరుస్తుంది.

వీటిలోని ఆల్కలాయిడ్ భాగం పైపెరిన్ అభిజ్ఞా మెదడు పనితీరులో సహాయపడతుంది. మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.

మిరియాలు శ్లేష్మాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. జ్వరాలు, గ్యాస్ట్రిక్, శ్వాసకోశ, మూత్ర వ్యాధుల ఆయుర్వేద చికిత్సలో దీనిని వినియోగించే వారని అధ్యయనంలో పేర్కొంది.

మిరియాలు శరీరంలో మెటబాలిజంను పెంచి, కొవ్వును వేగంగా కరిగించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. నల్లమిరియాలు బరువు తగ్గడంలో సహాయపడతాయి.

సైనస్, ఉబ్బసం, నాసికా రద్దీని నయం చేస్తుందని, ఇది క్యాన్సర్, గుండె, కాలేయ వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

మిరియాలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చూసి, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.