Navy commando: నేవీ కమాండో గోవింద్‌కి క‌డ‌సారి వీడ్కోలు.. పర్లలో ఉద్విగ్న వాతావరణం.. భారీగా తరలివచ్చిన ప్రజలు..

విజయనగరం జిల్లా పర్లలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. నేవీ కమాండో గోవింద్‌కి క‌డ‌సారి వీడ్కోలు ప‌లుకేందుకు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అంద‌రూ కదిలి వచ్చారు. అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

Navy commando: నేవీ కమాండో గోవింద్‌కి క‌డ‌సారి వీడ్కోలు.. పర్లలో ఉద్విగ్న వాతావరణం.. భారీగా తరలివచ్చిన ప్రజలు..
Indian Navy Commando
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 07, 2023 | 2:22 PM

విజయనగరం జిల్లా పర్లలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. నేవీ కమాండో గోవింద్‌కి క‌డ‌సారి వీడ్కోలు ప‌లుకేందుకు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అంద‌రూ కదిలి వచ్చారు. అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ప్యారాచ్యూట్‌ శిక్షణలో ప్రాణాలు కోల్పోయిన చందక గోవింద్ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. కర్తవ్య నిర్వహణలోనే కన్నుమూసిన గోవింద్‌కు అంతిమ వీడ్కోలు పలికారు. నేవీ కమాండోకు జనం వందనాలు పలికారు.

నేవీ కమాండో గోవిందకు అంతిమ వీడ్కోలు పలికేందుకు జనం భారీగా తరలివచ్చారు. దారిపొడవునా ప్రజలు నివాళి అర్పించారు. పార్దీవదేహాంతో వెళ్తున్న వాహనంపై జనం పూల వర్షం కురిపించారు. కొందరు యువత జాతీయ జెండాలను చేతుల్లో పట్టుకుని ఆ వాహనం వెంట పరుగులు తీశారు. రోడ్డుకు ఇరువైపుల నిలబడ్డ జనం.. పువ్వులు కురిపిస్తూ.. త్రివర్ణ జెండాలను ఊపుతూ తమ దేశభక్తిని చాటారు. వందేమాతరం నినాదాలతో వీధులు మార్మోగాయి. గోవింద్‌ అమర్ రహే అన్న నినాదాలు మిన్నంటాయి.

కుమారుడి మృతితో గోవింద్ తల్లి తల్లడిల్లుతున్న తీరు అందర్నీ కలిచి వేసింది. పెద్దదిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యులంతా కన్నీరుమున్నీరై రోదిస్తున్నారు. ఎప్పుడూ దేశ సేవకే అంకితమయ్యాడని, చివరకు ఆ వృత్తిలోనే ప్రాణాలు విడిచాడని బరువెక్కిన హృదయాలతో చెందుతున్నారు. గోవింద్‌పై కుటుంబం మొత్తం ఆధారపడి ఉండటంతో పెళ్లికి దూరంగా ఉండిపోయారని స్థానికులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

గోవింద్ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. గోవింద అంతిమయాత్రలో త్రివిద దళాల అధికారులు పాల్గొన్నారు. అప్పటి వరకు తమతో పాటు శిక్షణలో పాల్గోన్న సహచరుడు కళ్ల ముందే ప్రాణాలు కోల్పోయిన ఘటన నేవీ కమాండోలను నిశ్చేష్టుల్ని చేసింది. అంతిమయాత్రలో బరువెక్కిన హృదయాలు, కన్నీటి చారికలు కనిపిస్తున్నాయి.

నిన్న మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ శిక్షణా కార్యక్రమంలో ప్రమాదవశాత్తూ గోవింద చనిపోయారు..పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్ జిల్లాలో పారాట్రూపర్స్ ట్రైనింగ్ టీమ్‌లో కమాండో గోవింద్ విధులు నిర్వహిస్తోంది..శిక్షణలో భాగంగా ఆయన ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి కిందకి దూకారు..అయితే వందల అడుగుల ఎత్తులో ఉండగా ఆయన ప్యారాచ్యూట్‌ తెరుచుకోలేదు..దీంతో అంత ఎత్తు నుంచి కిందపడడంతో ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ బెంగాల్‌ నుంచి స్వగ్రామానికి ఇవాళ ఆయన పార్థవదేహన్ని తీసుకొచ్చారు. ఆ పార్థివదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించారు కుటుంబసభ్యులు. ఆపై గోవింద పార్ధివదేహాన్ని ఇంటి నుంచి స్మశాన వాటికకు తీసుకెళ్లారు..అధికారిక లాంఛనాలతో పర్లలో అంత్యక్రియలు నిర్వహించారు. గ్రామస్తులంతా నేవి కమాండో భౌతిక కాయానికి సెల్యూట్ చేసి ఆశ్రునివాళి ఘటించారు. అక్కడ అందరి కళ్లు చెమర్చాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..