Parvathipuram Manyam District: పార్వతీపురం మన్యం జిల్లాలో దారుణం వెలుగు చూసింది. జిల్లాలో నాటు వైద్యం కలకలం సృష్టించింది. కడుపు నొప్పి అని వస్తే.. పొట్టపై వాతలు పెట్టారు ఓ నాటు వైద్యురాలు. అదేమంటే.. కడుపులో బల్ల ఉందని, వాతలు పెడితే కరిగిపోతుందంటూ మూర్ఖపు సమాధానం ఇచ్చింది. ఈ అమానుష ఘటన మక్కువ మండలం ఆలుగూడలో వెలుగు చూసింది. ఆలుగూడలో మూడేళ్ల చిన్నారికి కడుపు నొప్పి వస్తుండటంతో ఆమె తల్లిదండ్రులు నాటు వైద్యురాలి వద్దకు తీసుకెళ్లారు. చిన్నారిని పరిశీలించిన నాటు వైద్యురాలు కడుపులో బల్ల ఉందని, కరగటానికి పొట్టపై వాతలు పెట్టాలంటూ.. కాల్చి వాతలు పెట్టేసింది. ఆమె చేసిన నిర్వాకానికి చిన్నా పొట్టపై తీవ్ర గాయాలు అయ్యాయి. చిన్నారి ఆరోగ్య పరిస్థితి దిగాజారడంతో.. పార్వతీపురం ఆస్పత్రికి తరలించారు తల్లిదండ్రులు. చిన్నారిని పరిశీలించిన వైద్యులు చికిత్స అందించారు. అయితే, పాపకు కడుపు నొప్పి తగ్గినా.. పొట్టపై కాల్చిన గాయాలతో తీవ్రంగా బాధపడుతోంది. ఈ ఘటనపై పార్వతీపురంలో తీవ్ర కలకలం సృష్టించింది.