National Green Tribunal Serious on AP CS: ఏపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. తమ ఆదేశాలను ధిక్కరించి పనులు చేస్తే అధికారులు జైలుకు వెళ్లక తప్పదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వార్నింగ్ ఇచ్చింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు జరుగుతుంటంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. పర్యావరణ అనుమతుల్లేకుండా పనులు జరపొద్దని గతంలోనే ఎన్జీటీ ఆదేశాలిచ్చింది. అయితే ఎన్జీటీ ఆదేశాలను ధిక్కరించి పనులు చేస్తున్నారన్న పిటిషన్‌పై చాలా సీరియస్ అయింది. తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కృష్ణా బోర్డును ఆదేశించింది. తదుపరి విచారణ జులై 12కు వాయిదా వేసింది.
ఎన్జీటీ ఆదేశాలు ఉల్లంఘిస్తూ పనులు చేస్తున్నారని తెలంగాణ వాసి గవినోళ్ల శ్రీనివాస్ ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విచారణ చేపట్టిన ఎన్జీటీ చెన్నై ధర్మాసనం.. ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎత్తిపోతల తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు, చెన్నైలోని కేంద్ర పర్యావరణ శాఖ ప్రాంతీయ కార్యాలయాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జులై 12కు వాయిదా వేసింది.
Read Also…