Nara Lokesh: దివంగత సీఎం YSRకి నివాళులు అర్పించిన నారా లోకేష్‌..

|

May 14, 2023 | 11:23 AM

దివంగత సీఎం YSRకి నివాళులు అర్పించారు నారా లోకేష్‌.. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా.. కానీ ఇదే జరిగింది.. YSR విగ్రహాన్ని చూసి.. ఆగి మరీ నారా లోకేష్‌ నమస్కారం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్దాం..

Nara Lokesh: దివంగత  సీఎం YSRకి నివాళులు అర్పించిన నారా లోకేష్‌..
Nara Lokesh
Follow us on

TDP జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నంద్యాల జిల్లాలో కొనసాగుతోంది. శ్రీశైలం నియోజకవర్గంలో నల్లకాలువ పంచాయతీ సమీపంలో ఉన్న వైఎస్ఆర్ స్మృతి వనం దగ్గర మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి లోకేష్ నివాళులర్పించారు. కాగా లోకేష్‌ యువగళం పాదయాత్ర 99వ రోజుకు చేరుకుంది. ఆత్మకూరు చెంచుకాలనీ నుంచి ఆదివారం పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్రలో భాగంగా తెలుగు గంగ ప్రాజెక్ట్‌ను లోకేష్‌ పరిశీలించనున్నారు. రాత్రి బోయరేవుల దగ్గర లోకేష్‌ బస చేస్తారు.

మరోవైపు వైసీపీ సర్కార్‌పై పంచ్‌లు పేల్చుతూనే ఉన్నారు లోకేశ్. తమ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన వైసీపీ నాయకులు వడ్డీతో సహా చెల్లిస్తామని వార్నింగ్ ఇచ్చారు. వృథాగా పోతున్న కృష్ణా జలాలను రాయలసీమకు తరలించాలని తొలుత యోచించింది అన్న ఎన్టీఆర్ అని తెలిపారు. జగన్ పిరికితనంతో తనను అడ్డుకోడానికి జీవో1 తెచ్చారని…ఇప్పుడు ఆ జీవోని హైకోర్టు కొట్టేసిందని..  2024 ఎన్నికల్లో ఏ1 జెండా పీకేయడం పక్కానని లోకేశ్ జోష్యం చెప్పారు. జగన్ 50 శాతం సబ్సిడీతో లోన్స్ ఇస్తాం అని దళితుల్ని మోసం చేశారని లోకేశ్ విమర్శలు గుప్పించారు. శ్రీశైలం శాసనసభ్యుడు శిల్పా చక్రపాణి రెడ్డి, ఆయన తమ్ముడు, బంధువులు, అనుచరులు కలిసి శ్రీశైలంను దోచుకుంటున్నారని… లోకేశ్ ఆరోపించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..