
తెలుగుదేశం కార్యకర్తలకు, తనకు మధ్య పోలీసులు అడ్డువచ్చారంటూ మంత్రి నారా లోకేష్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు..బందోబస్తు పేరుతో పోలీసులు కార్యకర్తలను పక్కకు నెట్టేస్తుండటంతో వీరి మధ్యంలో చిక్కుకున్న సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్‌కుమార్ ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని గమనించిన లోకేష్ సింగరాయకొండ సిఐ హజరతయ్య, టంగుటూరు ఎస్‌ఐ నాగమల్లేశ్వరరావులను దూరంగా ఉండాలంటూ హెచ్చరించారు.
ప్రకాశం జిల్లా టంగుటూరు సమీపంలోని టోల్ ప్లాజా దగ్గర మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం పలికారు టిడిపి శ్రేణులు.. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం దగదర్తి గ్రామంలో ఇటీవల మృతి చెందిన మాలెపాటి సుబ్బనాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు మంత్రి లోకేష్ వెళుతుండగా ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్‌కుమార్, ఇతర టిడీపీ నేతలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వినతి పత్రాలు ఇచ్చేందుకు టీడీపీ నేతలు పోటీపడ్డారు. కార్యకర్తలు తోసుకుంటుండగా వారిని పక్కకు నెట్టే ప్రయత్నం చేసిన సింగరాయకొండ సిఐ హజరత్తయ్య, టంగుటూరు ఎస్సై నాగమల్లేశ్వరరావులపై మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిఐ హజరతయ్యను పక్కకు రావాల్సిందిగా పలుమార్లు హెచ్చరించారు. తనకు, కార్యకర్తలకు మధ్య పోలీసులు ఎందుకు వస్తారంటూ సీఐపై మండిపడ్డారు… పోలీసుల అడ్డుగా ఉండటంతో సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్‌కుమార్ మంత్రి లోకేష్‌ను కలిసేందుకు ఇబ్బంది పడ్డారు.. పోలీసులను పక్కకు వెళ్ళాల్సిందిగా లోకేష్ పలుమార్లు హెచ్చరించినా బందోబస్తు నిర్వహించే పోలీసులు జరగలేదు.. దీంతో అక్కడే ఉన్న పోలీసులపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..