Avuku Boat Accident : నంద్యాల పడవ బోల్తా ఘటన.. అవుకు రిజర్వాయర్‌లో కొనసాగుతున్న గాలింపు.. పెరిగిన మృతుల సంఖ్య..

|

May 15, 2023 | 7:29 AM

ఇక.. టూరిజం శాఖకు చెందిన బోటు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. బోటు సరిగా లేదని.. కనీసం లైఫ్ జాకెట్లు కూడా తీసుకెళ్లలేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. బోటు ప్రమాదంపై డోన్‌ ఆర్డీవో వెంకట్‌రెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి విచారణ చేపట్టారు. ప్రమాదం జరగడం బాధాకరమన్నారు. పర్యాటకులతో జలాశయంలోకి వెళ్లిన బోటులోకి నీళ్లు చేరడంతో ఒక్కసారి బోల్తా పడింది.

Avuku Boat Accident : నంద్యాల పడవ బోల్తా ఘటన.. అవుకు రిజర్వాయర్‌లో కొనసాగుతున్న గాలింపు.. పెరిగిన మృతుల సంఖ్య..
Boat Accident
Follow us on

ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు విహారయాత్రకు వెళ్లిన పర్యాటకులను విషాదం వెంటాడింది. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల నుంచి రసూల్ అనే కానిస్టేబుల్ కుటుంబం 12మందితో అవుకు రిజర్వాయర్‌లో షికారుకు వెళ్లింది. అయితే.. పర్యాటకులతో జలాశయంలోకి వెళ్లిన బోటులోకి నీళ్లు చేరడంతో ఒక్కసారి బోల్తా పడింది. బోటులోని 12 మంది నీళ్లలో గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో.. ఇద్దరు ఒడ్డుకు చేర్చేలోపే ప్రాణాలు కోల్పోగా.. ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అక్కడికక్కడే మృతి చెందినవారిని కానిస్టేబుల్ రసూల్ కూతురు సాజీదా, ఆయన అన్న కూతురు ఆశాబీగా, ఆస్పత్రిలో మృతి చెందిన మహిళను నూర్జహాన్‌గా గుర్తించారు. ఈమె నంద్యాలలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది.

ఇక.. సాజిదా ఇటీవల జరిగిన నీట్ ఎగ్జామ్‌లో మంచి మార్కులు సాధించి.. త్వరలో మెడిసిన్‌లో జాయిన్ కావాల్సి ఉంది. అలాగే.. ఆశాబీ తిరుపతిలో అగ్రికల్చర్ ఎమ్మెస్సీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఎంతో భవిష్యత్‌ ఉన్న సాజిదా, ఆశాబీ అనుకోని విధంగా విహారయాత్రకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. అయితే.. బోటు ప్రమాదం జరిగిన వెంటనే ఒడ్డున ఉన్న స్థానికులు అప్రమత్తమై 8మందిని ప్రాణాలతో కాపాడగలిగారు. దాంతో.. పెను ప్రమాదం తప్పినట్లు అయింది. ఇక.. టూరిజం శాఖకు చెందిన బోటు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. బోటు సరిగా లేదని.. కనీసం లైఫ్ జాకెట్లు కూడా తీసుకెళ్లలేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

బోటు ప్రమాదంపై డోన్‌ ఆర్డీవో వెంకట్‌రెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి విచారణ చేపట్టారు. ప్రమాదం జరగడం బాధాకరమన్నారు. బోటు ప్రమాదానికి టెక్నికల్‌ లోపమా?.. డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణమా అనే కోణంలో విచారణ చేస్తామన్నారు డోన్‌ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..