
Taraka Ratna – Nara Lokesh Meet: తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్‌తో.. నందమూరి తారకరత్న భేటీ అయ్యారు. ఈ మేరకు మంగళవారం నారా లోకేష్‌తో, నందమూరి తారకరత్న మర్యాద పూర్వకంగా కలిసి.. ఏపీ రాజకీయాలు సహా పలు విషయాలపై చర్చించారు. ఏపీ రాజకీయాలపై ఫోకస్ చేసిన నందమూరి తారకరత్న.. ఇటీవల రాష్ట్రంలో వరుస పర్యటనలు చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం ఉందని తన మనసులోని మాటను బయటపెట్టారు. ఈ తరుణంలో నారా లోకేష్ ను కలిసి.. ప్రస్తుత రాజకీయ అంశాలతో పాటు.. వచ్చే ఎన్నికల్లో పోటీ తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఫ్యామిలీ విషయాలతో పాటు.. పార్టీ విషయాలను చర్చించినట్లు సమాచారం. దీంతో లోకేష్.. తారకరత్న భేటీ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశంలో రాబోయే ఎన్నికల్లో తారకరత్న ఎమ్మెల్యే టికెట్ విషయం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం.
లోకేష్ తో భేటీ విషయాన్ని తారకరత్న ట్వీట్ చేసి వెల్లడించారు.. ‘‘నన్ను కలవడానికి సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు. మీ అంకితభావం నిజంగా స్ఫూర్తిదాయకం, మున్ముందు మేము కలిసి ఎలా పని చేయాలో చర్చించే అవకాశాన్ని ఇచ్చినందుకు నేను అభినందిస్తున్నాను. దీనినే కొనసాగించి మన తెలుగుదేశం పార్టీలో సానుకూల ప్రభావం చూపేందుకు నేను ఎదురుచూస్తున్నాను.’’ అంటూ తారకరత్న ట్వీట్ చేశారు.
Thank you for taking the time to meet me.
Your dedication is truly inspiring, and i appreciate the opportunity to discuss how we can work together. I look forward to continuing the conversation and making a positive impact in our Telugu Desam Party. pic.twitter.com/yeku2JM3WG— Nandamuri Taraka Ratna (@NTarakaRatna) January 10, 2023
ఏపీ నుంచి పోటీకి సిద్దమవుతున్న తారకరత్న ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో నందమూరి కుటుంబం సంపూర్ణ మద్దతు తెలుగుదేశానికి ఉంటుందని తారకరత్న ఇటీవల జరిగిన కార్యక్రమంలో వెల్లడించారు. నందమూరి, నారా కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే విధంగా కొందరు చేసే వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు. అయితే.. గతంలోనూ టీడీపీకి మద్దతుగా పలు జిల్లాల్లో పర్యటించిన తారకరత్న.. రాజకీయంగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..