నందమూరి బాలకృష్ణ రెండో అల్లడు, గీతం విద్యాసంస్థల అధినేత.. మతుకుమిల్లి శ్రీభరత్ విశాఖ నుంచి కూటమి అభ్యర్థికి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే . 2019లోనూ విశాఖ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన భరత్.. 4 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు ఆయన మరోసారి తన ఫేట్ టెస్ట్ చేసుకోబోతున్నారు. ఇక్కడి నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ బరిలో ఉన్నారు. ఈ క్రమంలో భరత్ ప్రచారంలో స్పీడు చూపిస్తున్నారు. ఇతనికి సౌమ్యుడిగా పేరుంది. తన ఇమేజ్‌కు తగ్గట్లుగానే ప్రత్యర్థులను పర్సనల్‌గా టార్గెట్ చేయకుండా.. అంశాల వారీగా విబేధిస్తున్నారు.
ఇక రాజకీయాలు పక్కనబెడితే.. తన మామ బాలకృష్ణ గురించి భరత్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. బాలయ్యది చిన్న పిల్లాడి మనస్తత్వమని పేర్కొన్నాడు.. ఆయన ఆల్కాహాల్ హ్యాబిట్ గురించి కూడా పబ్లిక్‌గా కామెంట్ చేసేశారు భరత్. బాలకృష్ణ మాన్షన్ హౌస్ బ్రాండ్ మందు తాగుతారని తమకు తెలుసని చెప్పారు. ఆయన ప్రజంట్ దానికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారన్నారు. బాలయ్యే వల్లే మాన్షన్ హౌస్ బ్రాండ్ వాల్యూ పెరిగిందని సరదాగా వ్యాఖ్యానించారు. బయట ప్రచారంలో ఉన్నట్లుగానే బాలయ్య… మాన్షన్ హౌస్ మందును వేడి నీళ్లలో కలుపుకొని తాగుతారని చెప్పారు. ఆయన ఎక్కడికి వెళ్లినా.. ఓ బ్యాగ్‌లో హాట్ వాటర్, బాటిల్ ఉంటుందన్నారు. అమెరికా వెళ్లినా తీసుకెళ్తారన్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Mansion house sales peragatanike karanam #Balayya 😉
Hot water+ Mansion House
Okkasari Try chyali 😋 pic.twitter.com/UXEtrf4nnh— S U N N Y (@NSTC9999) April 27, 2024
(మద్యపానం ఆరోగ్యానికి హానికరం)
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..