
ఈ సంవత్సరం నాగ పంచమి పండగ జూలై 27న జరుపుకోనున్నారు. హిందూ మతంలో నాగ పంచమి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది పాములను పూజించే పండుగ. ఈ రోజున హిందువులు పాములను నియమాలు, ఆచారాలతో పూజిస్తారు.
పాముల ఉనికి కశ్యప మహర్షి అతని మొదటి భార్య కద్రువ నుంచి వచ్చినట్లు నమ్ముతారు. భవిష్య పురాణం ప్రకారం ఈ ఇద్దరూ సర్ప జాతికి తల్లిదండ్రులు. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో నాగ పంచమి పండుగను వివిధ మార్గాల్లో జరుపుకుంటారు. ఈ పండగను జరుపుకోవడం ప్రారంభం వెనుక ఒక పురాణ కథ ఉంది.
తన పిల్లలైన పాములను శపించిన తల్లి కద్రువ
పురాణాల ప్రకారం ఒకసారి కశ్యప మహర్షి ఇద్దరు భార్యలు కద్రువ, వినత.. దక్షుని కుమార్తెలు, అక్కాచేలెల్లు. కద్రువ వేయి మంది సర్పాలకు తల్లి అయితే, వినత ఇద్దరు కుమారులకు తల్లి. అనూరుడు, గరుత్మంతుడు.
కద్రువ, వినతలు ఇద్దరూ కలిసి తిరుగుతుండగా.. వారిద్దారూ ఒక తెల్ల గుర్రాన్ని చూశారు. కద్రువ గుర్రం తోక నల్లగా ఉందని చెప్పింది కానీ వినత కాదు, గుర్రం తోక చాలా తెల్లగా ఉందని చెప్పింది. కద్రువ వినత చేతిలో ఓడిపోవడం ఇష్టం లేదు. కనుక ఆమె తన కుమారులను వెళ్లి తోక నల్లగా ఉండే విధంగా చుట్టుకోమని కోరింది. కానీ కుమారులు అలా చేయడానికి నిరాకరించడంతో, కద్రువ తన సొంత పిల్లలను పాండవ వంశానికి రాజు జనమేజయుడి చేసే యాగంలో పడి నాశనం అవుతారని శపించింది.
పాముల ప్రాణాలను కాపాడిన ఆస్తిక ముని
జనమేజయుడి తండ్రి పరీక్షిత మహారాజుని తక్షకుడు కాటు వేయడంతో ఆయన మరణించాడు. దీనితో పాముల మీద కోపంతో రాజు జనమేజయుడి సర్ప మేధ యాగం చేసాడు. ఈ యాగం లో లక్షలాది పాములు కాలి బూడిదయ్యాయి. అప్పుడు ఆస్తిక ముని వచ్చి రాజు ఈ యాగం చేయడం సరికాదని చెప్పి ఒప్పించాడు. అతను పాముల మీద చల్లని పాలు పోశాడు. ఇలా చేయడం వలన పాములు ప్రాణాలతో బయటపడ్డాయి. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై భూమిపై సర్పాల ఉనికిని కాపాడమని ఆశీర్వదించాడు. పాముల ప్రాణాలను కాపాడిన రోజు శ్రావణ మాసం శుక్ల పక్షం పంచమి తిథి. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఈ శ్రావణ పంచమి తిథి పాములకు చాలా ప్రియమైనది. అప్పటి నుంచి నాగ పంచమి రోజున పాములను పూజిస్తారు. వాటికి పాలను సమర్పిస్తారు. చేయడం వలన సర్పాలు ఎల్లప్పుడూ తమని రక్షిస్తాయని నమ్ముతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.