Minister Nadendla: ఏపీలో ధరల స్థిరీకరణ కోసం మంత్రి నాదెండ్ల రిక్వెస్ట్

|

Aug 08, 2024 | 9:45 PM

ఏపీలో ధరల స్థిరీకరణ కోసం నిధులు కేటాయించాలని కేంద్రమంత్రి జోషిని కోరారు మంత్రి నాదెండ్ల మనోహర్‌. మరోవైపు ప్రజా సమస్యలను వదిలేసి, కేవలం తన సెక్యూరిటీ కోసమే జగన్‌ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు మంత్రి నాదెండ్ల.

Minister Nadendla: ఏపీలో ధరల స్థిరీకరణ కోసం మంత్రి నాదెండ్ల రిక్వెస్ట్
Nadendla Manohar - Pralhad Joshi
Follow us on

ఢిల్లీలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో ఏపీ మంత్రి నాదెండ్ల భేటీ అయ్యారు. ఏపీకి కందిపప్పు కేటాయింపులు చేయాలని విన్నవించారు. ధరల స్థిరీకరణ కోసం 532 కోట్లు కేటాయించాలని కోరారు. మరోవైపు 1187 కోట్ల పెండింగ్‌ నిధులు విడుదల చేయాల్సి ఉందన్నారు. 11 గోడౌన్ల నిర్మాణానికి అనుమతివ్వాలని కేంద్రమంత్రిని కోరారు నాదెండ్ల. దేశవ్యాప్తంగా కందిపప్పు కొరత తీవ్రంగా ఉందని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో కేవలం 150 రూపాయలకే కేజీ కందిపప్పు ఇస్తున్నామన్నారు.

మరోవైపు పవన్‌ కల్యాణ్‌ ఎవరిపైనా వ్యక్తిగతంగా మాట్లాడరన్నారు, అడవుల విస్తీర్ణం పెంచాలనే ఉద్దేశంతో మాట్లాడిఉంటారన్నారు. రాష్ట్రంలో చెక్‌పోస్టుల ఏర్పాటు మంచి కోసమే అన్నారు నాదెండ్ల. మరోవైపు కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంతో పాటు, రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతున్న కూటమి ప్రభుత్వంపై వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తుందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్‌. కొత్త ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు మంత్రి. ప్రజాసమస్యల గురించి వదిలేసి సొంత సెక్యూరిటీపై మాట్లాడే జగన్‌ ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టమనడం హస్యాస్పదంగా ఉందన్నారు నాదెండ్ల. వైసీపీ నేతలు, ప్రజా ప్రతినిధులు ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తే మంచిదని మంత్రి నాదెండ్ల సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..