Municipal ఏపీలో కొనసాగుతున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్..

|

Jan 06, 2024 | 7:35 AM

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కార్మికుల సమ్మె 12వ రోజుకు చేరుకుంది. తమ డిమాండ్లను పరిష్కరించేవరకూ సమ్మె విరమించబోమని కార్మికులు హెచ్చరించారు. ఏపీలో మున్సిపల్ కార్మికులు కదం తొక్కుతున్నారు. ప్రతి పట్టణ కేంద్రంలోనూ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. కడప నగరంలోని కార్పొరేషన్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు గుండు కొట్టించుకుని, పంగనామాలు పెట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు.

Municipal ఏపీలో కొనసాగుతున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమ్మె.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్..
Municipal Sanitation Workers
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ కార్మికుల సమ్మె 12వ రోజుకు చేరుకుంది. తమ డిమాండ్లను పరిష్కరించేవరకూ సమ్మె విరమించబోమని కార్మికులు హెచ్చరించారు. ఏపీలో మున్సిపల్ కార్మికులు కదం తొక్కుతున్నారు. ప్రతి పట్టణ కేంద్రంలోనూ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. కడప నగరంలోని కార్పొరేషన్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు గుండు కొట్టించుకుని, పంగనామాలు పెట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు వర్కర్లను పర్మినెంట్ చేయాలని 11 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని మున్సిపల్ కార్మికులు మండిపడ్డారు.

శ్రీకాకుళం జిల్లాలో మున్సిపల్ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు వినూత్న నిరసనకు దిగారు. దీక్ష శిబిరం వద్ద పోర్లు దండాలు పెడుతూ తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ వేడుకున్నారు. కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే తమ ఆందోళనను మరింత ఉదృతం చేస్తామని కార్మిక సంఘాల నేతలు హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..