Machumarri Girl Mystery: మృతదేహానికి రాళ్లు కట్టి రిజర్వాయర్‌లో పడేశారు.. ముచ్చుమర్రి బాలిక కేసులో వీడని మిస్టరీ..

|

Jul 16, 2024 | 9:28 PM

నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో ఈ నెల 7న అత్యాచారం, హత్యకు గురైన ఐదవ తరగతి బాలిక మిస్టరీ కేసు కొత్త మలుపు తిరుగుతోంది. మృతదేహాన్ని వెతికి తీసుకురావడం సాధ్యం కాకపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పది రోజులు అవుతున్నా.. బాలిక డెడ్‌బాడీ ఆచూకీ లభించలేదు. ముగ్గురు మైనర్‌ నిందితులు, వారి పేరెంట్స్‌ ఇచ్చిన సమాచారంతో..

Machumarri Girl Mystery: మృతదేహానికి రాళ్లు కట్టి రిజర్వాయర్‌లో పడేశారు.. ముచ్చుమర్రి బాలిక కేసులో వీడని మిస్టరీ..
Machumarri Mystery
Follow us on

నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో ఈ నెల 7న అత్యాచారం, హత్యకు గురైన ఐదవ తరగతి బాలిక మిస్టరీ కేసు కొత్త మలుపు తిరుగుతోంది. మృతదేహాన్ని వెతికి తీసుకురావడం సాధ్యం కాకపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పది రోజులు అవుతున్నా.. బాలిక డెడ్‌బాడీ ఆచూకీ లభించలేదు. ముగ్గురు మైనర్‌ నిందితులు, వారి పేరెంట్స్‌ ఇచ్చిన సమాచారంతో SDRF, NDRF బృందాలు అత్యాధునిక స్కానర్ల ద్వారా వెతికినా లాభం లేకుండా పోయింది. అదేసమయంలో.. నిందితుల పొంతన లేని సమాచారంతోనూ వెతుకులాట కష్టంగా మారింది. ఈ క్రమంలోనే.. బాలిక మృతదేహానికి రాళ్లు కట్టి.. శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో వేసినట్లు మైనర్ నిందితుల పేరెంట్స్ అనుమానిస్తున్నారని పోలీసులు చెప్తున్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్‌లో ఏ ప్రాంతంలో అనేది కూడా నిందితులు స్పష్టంగా చెప్పకపోవడం కూడా పోలీసులను టెన్షన్‌ పెడుతోంది. దాంతో.. బాలిక డెడ్‌బాడీ గాలింపులో ఎలాంటి పురోగతి సాధించలేకపోతున్నారు పోలీసులు. నిందితులు ఒక్కోసారి ఒక్కో సమాచారం ఇస్తుండడంతో వారిపై మరిన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాలిక ఆచూకీ ఎలాగైనా తేల్చాలని హోంమంత్రి అనిత పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించడంతో తదుపరి ఏం చేయాలో అర్థం కాక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.

నంద్యాల జిల్లా ఎస్పీ, కలెక్టర్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. గాలింపు చర్యలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. కాగా.. ముచ్చుమర్రి బాలిక అత్యాచారం కేసులో కీలక విషయాలు వెల్లడించారు నంద్యాల ఎస్పీ ఆదిరాజ్‌. ముగ్గురు మైనర్లు బాలికపై అత్యాచారం జరిపి ఆపై గొంతునొక్కి హత్య చేశారన్నారు. ముందుగా మృతదేహాన్ని కేసీ కెనాల్ పక్కన పడేసి.. ఆ తర్వాత బంధువు సాయంతో కృష్ణా రివర్‌లో పడేసినట్టు విచారణలో తేలిందన్నారు. మృతదేహానికి రాళ్లు కట్టి రిజర్వాయర్‌లో పడేశారని.. బాలిక మృతదేహం కోసం సెర్చింగ్ కొనసాగుతోందన్నారు ఎస్పీ ఆదిసింగ్‌. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అండర్ వాటర్ స్కానర్స్‌తో గాలింపు చేపడుతున్నాయన్నారు. డెడ్‌బాడీ దొరికే వరకు గాలింపు కొనసాగుతుందన్నారు. నిందితులపై గ్యాంగ్‌రేప్ కింద కేసు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు.

ఇదిలావుంటే.. పది రోజులుగా బాలిక డెడ్‌బాడీ ఆచూకీ లభ్యం కాకపోవడంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తమ బిడ్డ మృతదేహాన్ని అయినా అప్పగించాలని వేడుకుంటున్నారు.

మొత్తంగా.. ఒకవైపు ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరుగుతుండడం.. మరోవైపు నిందితులు పొంతన లేని సమాచారం ఇస్తుండడంతో పోలీసులు డెడ్ బాడీ దొరికే వరకు వెతకాలని నిర్ణయించుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..