MP Avinash Reddy: ‘అమ్మ ఆరోగ్యం విషమంగా ఉంది.. విచారణకు రాలేను’ సీబీఐకి అవినాష్‌ రెడ్డి లేఖ

|

May 22, 2023 | 1:39 PM

దర్యాప్తు హాజరు కావాలంటూ సీబీఐ ఇచ్చిన నోటీసులకు ఎంపీ అవినాష్‌ రెడ్డి లిఖిత పూర్వకంగా జవాబిచ్చారు. విచారణకు హాజరుకాలేనంటూ సీబీఐకి మరో లేఖ రాశారు. సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ రేపు..

MP Avinash Reddy: అమ్మ ఆరోగ్యం విషమంగా ఉంది.. విచారణకు రాలేను సీబీఐకి అవినాష్‌ రెడ్డి లేఖ
MP YS Avinash Reddy
Follow us on

దర్యాప్తు హాజరు కావాలంటూ సీబీఐ ఇచ్చిన నోటీసులకు ఎంపీ అవినాష్‌ రెడ్డి లిఖిత పూర్వకంగా జవాబిచ్చారు. విచారణకు హాజరుకాలేనంటూ సీబీఐకి మరో లేఖ రాశారు. సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ రేపు విచారణకు రానుందని అవినాష్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. తల్లి లక్ష్మి (67) అనారోగ్యం దృష్ట్యా ఈనెల 27 వరకు విచారణకు హాజరు కాలేనని, తల్లి ఆరోగ్య సమస్య ఇంకా ఆందోళనకరంగానే ఉందని తెలిపారు. ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతోందని, బ్లడ్‌ ప్రెషర్‌తో పాటు హైపర్‌ టెన్షన్‌ ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు. ప్రస్తుతం కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు, ఈనెల 27 తర్వాత సీబీఐకి అందుబాటులో ఉంటానని లేఖలో పేర్కొన్నారు. లేఖ రూపంలో పంపిన తన విజ్ఞప్తిని సీబీఐ పరిగణలోకి తీసుకోవాలని అవినాష్ రెడ్డి కోరారు.

మరో వైపు కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తల్లి లక్ష్మమ్మ ఆరోగ్య పరిస్థితిపై సోమవారం ఉదయం వైద్యులు హెల్త్‌బులిటెన్‌ విడుదల చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.