మోరంపూడి ఫ్లైఓవర్ గడ్డర్ పనులు వేగవంతం.. దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ఎంపీ భరత్..

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ప్రజల కల సాకారం కానుంది. నగరంలోని మోరంపూడి జంక్షన్ వద్ద నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కీలక దశకు చేరుకున్నాయి. ఎన్నో ఏళ్లుగా ట్రాఫిక్ సమస్యలతో సతమతమౌతున్న నగర వాసులకు కాస్త ఊరట కల్పింననున్నారు. గతంలో ప్రతిపాధించిన నమూనాలను రద్దు చేసి కొత్తగా ఈ వంతెనను నిర్మించేందుకు కృషి చేశారు. అయితే బ్రిడ్జి నిర్మాణంలో అత్యంత ప్రధాన ఘట్టం కుడి, ఎడమల వంతెనలను అనుసంధానం చేస్తూ ఏర్పాటు చేసే గడ్డర్లను బుధవారం రాత్రి అమర్చారు.

మోరంపూడి ఫ్లైఓవర్ గడ్డర్ పనులు వేగవంతం.. దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ఎంపీ భరత్..
Mp Bharath

Edited By:

Updated on: Mar 21, 2024 | 8:53 AM

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ప్రజల కల సాకారం కానుంది. నగరంలోని మోరంపూడి జంక్షన్ వద్ద నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు కీలక దశకు చేరుకున్నాయి. ఎన్నో ఏళ్లుగా ట్రాఫిక్ సమస్యలతో సతమతమౌతున్న నగర వాసులకు కాస్త ఊరట కల్పింననున్నారు. గతంలో ప్రతిపాధించిన నమూనాలను రద్దు చేసి కొత్తగా ఈ వంతెనను నిర్మించేందుకు కృషి చేశారు. అయితే బ్రిడ్జి నిర్మాణంలో అత్యంత ప్రధాన ఘట్టం కుడి, ఎడమల వంతెనలను అనుసంధానం చేస్తూ ఏర్పాటు చేసే గడ్డర్లను బుధవారం రాత్రి అమర్చారు. భారీ వాహనాలపై గడ్డర్లను బ్రిడ్జి నిర్మాణ స్థలానికి తీసుకొచ్చి క్రేన్ల సహాయంతో అమర్చారు.

మోరంపూడి ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ గడ్డర్ల ఏర్పాటు సమయంలో రాత్రి వరకు అక్కడే ఉండి పనులు పర్యవేక్షించారు. విశాఖ, విజయవాడ వైపు నుండి వచ్చే వాహనాలకు ఎటువంటి ఇబ్బందీ కలగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా చూశారు. ఈ సారి మార్గాని భరత్ రాజమండ్రి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ తరఫున బరిలో దిగనున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సమస్యలపై ప్రత్యేక శ్రద్ద చేపిస్తున్నారు. అటు కేంద్రంతో అనుసంధానమై స్థానికంగా ఉన్న పెండింగ్ పనులను పూర్తి చేస్తూ ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..