AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nick Vujicic: ఇలాంటి సీఎంను ప్రపంచంలో ఎక్కడా చూడలేదు.. మోటివేషనల్‌ స్పీకర్‌ నిక్‌ వుజిసిక్‌ సంచలన వ్యాఖ్యలు..

విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి లాంటి వ్యక్తిని తాను ఇంతవరకూ చూడలేదంటూ మోటివేషనల్‌ స్పీకర్‌ నిక్‌ వుజిసిక్‌ కొనియాడారు.

Nick Vujicic: ఇలాంటి సీఎంను ప్రపంచంలో ఎక్కడా చూడలేదు.. మోటివేషనల్‌ స్పీకర్‌ నిక్‌ వుజిసిక్‌ సంచలన వ్యాఖ్యలు..
Nick Vujicic, Ys Jagan
Shaik Madar Saheb
|

Updated on: Feb 02, 2023 | 7:02 AM

Share

విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి లాంటి వ్యక్తిని తాను ఇంతవరకూ చూడలేదంటూ మోటివేషనల్‌ స్పీకర్‌ నిక్‌ వుజిసిక్‌ కొనియాడారు. సీఎం అత్యున్నతమైన లక్ష్యం కోసం ఉన్నతమైన ఆశయంతో పనిచేస్తున్నారన్నారు. ప్రముఖ మోటివేషనల్‌ స్పీకర్‌ నిక్‌ వుజిసిక్‌.. ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాల గురించి సీఎం జగన్, వుజిసిక్ చర్చించారు. ఏపీలోని పాఠ్యాంశాల్లో తన పాఠం చేర్చడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను కలవడం గౌరవంగా భావిస్తున్నట్లు నిక్ వుజిసిక్ తెలిపారు. దాదాపు 78 దేశాల్లో తాను పర్యటించానని, కానీ సీఎం జగన్ లాంటి వ్యక్తులను ఇంతవరకూ చూడలేదంటూ వుజిసిక్ తెలిపారు. ఏపీలో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్నట్టు అభిప్రాయపడ్డారు. ప్రయివేటు స్కూళ్లకు తీసిపోనిరీతిలో 45వేల ప్రభుత్వ స్కూళ్లను గొప్పగా అభివృద్ధి చేశారని కొనియాడారు. ఇది చాలా ఆసక్తికరమైన అంశం. ఈ రంగాల్లో ఇప్పటికే గణనీయమైన ప్రగతి కనిపిస్తోంది… ఇది అందరికీ తెలియాల్సి ఉందన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రపంచ స్ధాయి ప్రమాణాలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని.. ఇది మంచి విషయం అంటూ పేర్కొన్నారు.

Nick Vujicic, Ys Jagan

Nick Vujicic, Ys Jagan

ప్రపంచ స్ధాయి ప్రమాణాలతో ఏపీ స్కూళ్లలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కొనియాడారు. ‘‘నా పట్ల, నా జీవితం పట్ల మంచి అవగాహనతో స్పూర్తిదాయక వ్యక్తుల కింద.. ఆటిట్యూడ్‌ ఈజ్ ఆల్టిట్యూడ్‌ పేరుతో పదోతరగతి ఇంగ్లిషులో తన గురించి పాఠ్యాంశంగా ప్రవేశపెట్టారు’’. ఇది చాలా ఆనందం కలిగించే విషయమని వుజిసిక్ పేర్కొన్నారు. సీఎం జగన్ చాలా నిబద్ధత, క్రమశిక్షణ గల మనిషంటూ ప్రశంసించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..