Andhra Pradesh: చనిపోయిందనుకొని తల్లికి రెండేళ్ల క్రితం కర్మకాండలు..యూట్యూబ్‌లో ప్రత్యక్షమయ్యే సరికి..

| Edited By: Basha Shek

Jul 24, 2023 | 3:59 PM

Andhra Pradesh News: రెండేళ్ల పాటు కనిపించకుండా పోయిన.. ఆ మహిళ మరణించిందని భావించిన కుటుంబసభ్యులు కర్మకాండలను సైతం జరిపించారు. ఓ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న సమయంలో ఓ అనాథాశ్రమంలో తన తల్లి కనిపించడంతో ఆనందానికి గురైన ఆమె కుమారుడు.. ఎట్టకేలను తల్లిని ఇంటికి చేర్చుకున్న ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంది.

Andhra Pradesh: చనిపోయిందనుకొని తల్లికి రెండేళ్ల క్రితం కర్మకాండలు..యూట్యూబ్‌లో ప్రత్యక్షమయ్యే సరికి..
Orphanage Home
Follow us on

ఎన్టీఆర్ జిల్లా, జులై 24: రెండేళ్ల పాటు కనిపించకుండా పోయిన.. ఆ మహిళ మరణించిందని భావించిన కుటుంబసభ్యులు కర్మకాండలను సైతం జరిపించారు. ఓ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న సమయంలో ఓ అనాథాశ్రమంలో తన తల్లి కనిపించడంతో ఆనందానికి గురైన ఆమె కుమారుడు.. ఎట్టకేలను తల్లిని ఇంటికి చేర్చుకున్న ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ జిల్లా పుల్లూరు మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన నాగేంద్రమ్మ, తిరుపతయ్య దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. నాగేంద్రమ్మకు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో రెండు సంవత్సరాల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ఆమె కనిపించకపోవడంతో అవకాశం ఉన్న ప్రతిచోట నాగేంద్రమ్మ కోసం గాలించారు. అయినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. అదే సమయంలో సమీప ప్రాంతంలోని ఓ కొండమీద ఒక మహిళ హత్యకు గురైంది. దీంతో హత్యకు గురైన మహిళను నాగేంద్రమ్మగా భావంచిన కుటుంబ సభ్యులు ఆమె కర్మకాండలను కూడా జరిపించారు.

యూట్యూబ్‌లో చూసి..

నాగేంద్రమ్మ తప్పిపోయిన రెండేళ్ల తర్వాత ఆమె కుమారుడు ఓయూట్యూబ్ ఛానల్ వీక్షిస్తుండగా.. విజయవాడ పట్టణానికి చెందిన హెల్పింగ్ హ్యాండ్స్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు తన యూల్యూబ్ ఛానల్ లో ప్రసారం చేసిన వీడియో వారి కుటుంబ సభ్యులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆ వీడియోలో తన కన్నతల్లిని గుర్తించిన కుమారుడు.. ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆర్కే ఫౌండేషన్ అడ్రస్ తెలుసుకుని.. తల్లి నాగేంద్రమ్మను కలుసుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో నాగేంద్రమ్మకు చెందిన ఆధారాలను చూపించి.. తమకు అప్పగించాలని వేడుకున్నారు. నాగేంద్రమ్మ తప్పిపోయిన సమయంలో ఏం జరిగిందనే విషయాలు సదరు ఆశ్రమ నిర్వాహకులు వివరించారు. ఆశ్రమానికి వెళ్లిన తర్వాత నాగేంద్రమ్మ తన పేరు కూడా చెప్పకపోవడంతో ఆమెను స్వర్ణ అని పిలిచేవారు. అలా రెండేళ్ల పాటు కుటుంబానికి దూరంగా ఉన్న నాగేంద్రమ్మను.. తాజాగా కుటుంబ సభ్యులు పోలీస్ వారి సహకారంతో ట్రైనీ ఐపీఎస్ అవినాష్ కుమార్ నేతృత్వంలో కేసు పూర్వాపరాలు పరిశీలించి సదర మహిళను వారి బంధువుల సమక్షంలో కుటుంబ సభ్యులకు అప్పగించారు.

 

ఇవి కూడా చదవండి

 

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..