AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ నిచ్చెన ఆమెను కాపాడింది.. కానీ తల్లీ, తమ్ముడిని మాత్రం కోల్పోయింది..!

విశాఖలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి బావిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. తల్లి, కొడుకు ప్రాణాలు కోల్పోగా.. బావిలో నుంచి చిన్నారి అరుపులు విని, స్థానికులు కూతురును సేఫ్ గా బయటకు తీసి కాపాడారు. ఈ విషాద ఘటన విశాఖ జిల్లాలో వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఆ నిచ్చెన ఆమెను కాపాడింది.. కానీ తల్లీ, తమ్ముడిని మాత్రం కోల్పోయింది..!
Mother And Son Commit Suicidekj
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Jun 24, 2025 | 8:17 PM

Share

విశాఖలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహా తల్లి బావిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. తల్లి, కొడుకు ప్రాణాలు కోల్పోగా.. బావిలో నుంచి చిన్నారి అరుపులు విని, స్థానికులు కూతురును సేఫ్ గా బయటకు తీసి కాపాడారు. ఈ విషాద ఘటన విశాఖ జిల్లాలో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళితే.. విశాఖ జిల్లా పెందుర్తి మండలం సత్తివానిపాలెం గ్రామానికి చెందిన కొల్లు గీత.. పవన్ కుమార్ తో వివాహమైంది. రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా పవన్ కుమార్ పనిచేస్తూ ఉన్నాడు. వారికి ఇద్దరు పిల్లలు. ఎనిమిదేళ్ల మోక్షశ్రీ, ఆరేళ్ల మణికంఠ. మద్యానికి బానిసైన పవన్ కుమార్.. తరచూ భార్యతో గొడవ పడుతున్నాడు. నిత్యం డబ్బుల కోసం గీతను వేధిస్తున్నాడు. తాజాగా విద్యా దీవెన డబ్బులు అకౌంట్‌లో పడడంతో.. దానికోసం టార్చర్ పెట్టాడు పవన్ కుమార్. ఈ విషయంలో సోమవారం(జూన్ 23) రాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర మనస్థాపానికి గురైన గీత.. ఇద్దరు పిల్లలు భర్త నిద్రించిన తర్వాత.. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.

ఇద్దరు పిల్లలను నిద్రలేపి..

తండ్రి పట్టించుకోకపోతే, తాను చనిపోతే.. పిల్లల భవిష్యత్తు ఏంటని అనుకున్న గీత.. ఇద్దరు పిల్లల సహా ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది. పిల్లలను నిద్రలేపి.. ఇంటి ముందు ఉన్న బావి దగ్గరకు వెళ్ళింది. ఇద్దరు పిల్లలను లోపలికి చూసి.. తాను కూడా బావిలో దూకేసింది గీత.

చిన్నారి అరుపులు విని..

అదే సమయంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు నిద్ర లేచిన అత్త కొల్లి అప్పలనర్సమ్మ, బావిలోంచి అరుపులు రావడం గమనించింది. ఇంట్లో తల్లి పిల్లలు లేకపోవడంతో.. నూతిలో తొంగిచూసింది. స్థానికులను అప్రమత్తం చేసేసరికి.. హుటాహుటిన వచ్చి రక్షించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే గీత, మణికంఠ ప్రాణాలు కోల్పోయారు. పక్కనే ఓ నిచ్చనకు పట్టుకుని ఉన్న మోక్షశ్రీని క్షేమంగా ప్రాణాలతో బావి నుంచి బయటకు తీశారు స్థానికులు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

భర్త వేధింపులే కరణం అని ఆరోపిస్తూ గీత తల్లి వెంకటలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. ఒకే కుటుంబంలో తల్లి పిల్లల మృతితో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం అలుముకుంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..