AP News: కడియం నర్సరీలో సందడి చేసిన ఎమ్మెల్సీ కవిత..

తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ రంగానికి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎంతో తోడ్పాటు ఇచ్చారని ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత తెలిపారు. దేశంలోనే గాక ప్రపంచంలో ఎంతో గుర్తింపు పొందిన నర్సరీగా చెబుతూ కడియం నర్సరీలను సందర్శించారు. ఈ సందర్భంగా కడియపులంక శ్రీ సత్యదేవ నర్సరీలో విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం హరితహారం పేరుతో కోట్లాది రూపాయలు వెచ్చించి మొక్కలను కడియం నర్సరీల నుండి కొనుగోలు చేసిందన్నారు.

AP News: కడియం నర్సరీలో సందడి చేసిన ఎమ్మెల్సీ కవిత..
Mlc Kavita

Edited By:

Updated on: Feb 25, 2024 | 10:08 PM

తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ రంగానికి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎంతో తోడ్పాటు ఇచ్చారని ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత తెలిపారు. దేశంలోనే గాక ప్రపంచంలో ఎంతో గుర్తింపు పొందిన నర్సరీగా చెబుతూ కడియం నర్సరీలను సందర్శించారు. ఈ సందర్భంగా కడియపులంక శ్రీ సత్యదేవ నర్సరీలో విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం హరితహారం పేరుతో కోట్లాది రూపాయలు వెచ్చించి మొక్కలను కడియం నర్సరీల నుండి కొనుగోలు చేసిందన్నారు. ఈ ప్రాంతంలో వేలాది ఎకరాల్లో ఈ నర్సీలు విస్తరించి ఉండటం అభినందనీయమన్నారు. దేశంలో ఏ మూలకెళ్ళినా కడియం నర్సరీ మొక్కలు కనిపిస్తుంటాయి అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చదనంతో విరాజిల్లేలా కేసీఆర్ అద్భుతమైన హరితహారం కార్యక్రమం నిర్వహించినట్లు కవిత గుర్తుచేశారు.

ఈ పథకాన్ని నూతన ప్రభుత్వం కొనసాగించి తెలంగాణలో పచ్చదనం పెంపొందించడంతోపాటు కడియం నర్సరీ రైతులకు అండగా నిలవాలని సూచించారు. ఈ నర్సరీ మొక్కల ప్రత్యేకతలు వాటి పెంపకం తీరుతెన్నులను నర్సరీ రైతులు పుల్లా ఆంజనేయులు, వీరబాబు, రాజశేఖర్‎లు వివరించారు. పలు మొక్కలను చూసి కవిత ముచ్చట పడ్డారు. వాటితో ఫోటోలు తీసుకున్నారు. అనంతరం పుల్లా చంటి నర్సరీని సందర్శించారు. ఆ నర్సరీలో ఏర్పాటు చేసిన అయోధ్య రామ మందిరం కూర్పు‎ను పుల్లా పెద్ద సత్యనారాయణ కవితకు చూపించారు. అలాగే పల్ల వెంకన్న నర్సరీని కవిత సందర్శించారు. ఇప్పటికే ఈ నర్సరీలో పలు రకాల మొక్కలు తమ గార్డెన్‎లో ఉన్నాయన్నారు. నర్సరీలో పలు విదేశీ స్వదేశీ మొక్కలను తిలకించారు. కవితకు తొలుత నర్సరీ రైతులు పల్ల సత్తిబాబు, సుబ్రహ్మణ్యం, గణపతి, వెంకటేష్,వినయ్‎లు మొక్కను ఇచ్చి ఘన స్వాగతం పలికారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..