Balakrishna: గోరంట్ల వ్యవహారంపై స్పందించిన బాలయ్య.. సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి అంటూ ఘాటు వ్యాఖ్యలు

|

Aug 17, 2022 | 9:04 PM

Andhra Pradesh: ఏపీలో సంచలనం రేపిన ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌ వీడియో వ్యవహారంపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఘాటుగా స్పందించారు. సిగ్గుతో తలదించుకునే పని చేసి.. ఏ మొహం పెట్టుకుని జాతీయ జెండా ఆవిష్కరణకు ఎంపీ..

Balakrishna: గోరంట్ల వ్యవహారంపై స్పందించిన బాలయ్య.. సిగ్గుతో తలదించుకోవాల్సింది పోయి అంటూ ఘాటు వ్యాఖ్యలు
Mla Nandamuri Balakrishna
Follow us on

Andhra Pradesh: ఏపీలో సంచలనం రేపిన ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌ వీడియో వ్యవహారంపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఘాటుగా స్పందించారు. సిగ్గుతో తలదించుకునే పని చేసి.. ఏ మొహం పెట్టుకుని జాతీయ జెండా ఆవిష్కరణకు ఎంపీ వచ్చారని బాలయ్య ప్రశ్నించారు. సత్యసాయి జిల్లా లేపాక్షిలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. భారీగా తరలివచ్చిన కార్యకర్తల నడుమ ఆయన మాట్లాడుతూ మాధవ్ ఘటనపై తొలిసారిగా స్పందించారు. ‘ఎంపీ చేసిన పనికి సిగ్గుతో తలదించుకోవాలన్నారు. కానీ ఆయన జాతీయ జెండా ఎగురవేసేందుకు వచ్చారు. అందుకే మా పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అయితే పోలీసులు మా వాళ్లపై కేసులు పెట్టారు. ఇలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. సరైన సమయంలో గుణపాఠం చెబుతారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వారికి డీజిల్‌ కూడా దండగే..

కాగా ఏపీ పాలనపై కూడా ఘాటు విమర్శలు చేశారు బాలయ్య. రాష్ట్రంలో మంత్రులకు ఎవరెవరికి ఏఏ అధికారాలు ఉన్నాయో అర్థం కావడం లేదని, కాన్వాయిలు వేసుకుని షోలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వారికి డీజిల్ కూడా దండగే అంటూ కామెంట్ చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసి కేంద్రానికి దాసోహం అయ్యారని.. 25మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారని.. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదంటూ బాలయ్య అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. సంక్షేప పథకాల అమలులో కోత పెడుతున్నారని, అవకతవకలకు పాల్పడుతున్నారంటూ విమర్శించారు.

ఇవి కూడా చదవండి

 

ఇది కూడా చదవండి.. టెక్నాలజీలో సరికొత్త విప్లవానికి సిద్ధమైన ఎయిర్‌టెల్‌.. మారనున్న పలు రంగాల రూపు రేఖలు..