AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: నెల్లూరులో ఉద్రిక్తత.. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే ఫైర్.. ఏం విచారణ చేస్తున్నారని మండిపాటు..

నెల్లూరు దర్గామిట్ట పోలీస్‌స్టేషన్‌ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి కోపం వచ్చింది. తప్పుడు..

Andhra Pradesh: నెల్లూరులో ఉద్రిక్తత.. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే ఫైర్.. ఏం విచారణ చేస్తున్నారని మండిపాటు..
Anam Ramanarayana Reddy
Ganesh Mudavath
|

Updated on: Oct 14, 2022 | 7:19 AM

Share

నెల్లూరు దర్గామిట్ట పోలీస్‌స్టేషన్‌ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి కోపం వచ్చింది. తప్పుడు ఫిర్యాదులపై తన అనుచరులను స్టేషన్‌కు తీసుకురావడంతో ఫైర్ అయ్యారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండా స్టేషన్‌లో గంటలపాటు ఉంచడంపై మండి పడ్డారు. వేణుగోపాలస్వామి ఆలయ భూముల్లో అక్రమాలు జరిగాయని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో ఆలయ సిబ్బందిని పోలీసులు విచారణ కోసం స్టేషన్‌కు పిలిచారు. రంగంలోకి దిగిన ఎమ్మెల్యే ఆనం.. స్టేషన్‌ చేరుకుని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఏం విచారణ చేస్తున్నారంటూ మండిపడ్డారు. తప్పుడు ఆరోపణలపై విచారణ చేయకుండానే స్టేషన్‌కు ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించారు. సీఐ తీరుపై ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. ఇదేం పద్ధతంటూ నిలదీశారు.

నెల్లూరు నగరంలో ఇలాంటి దాడులు పెరిగిపోయాయని ఆవేదన చెందారు. భయపెట్టి భూములను ఆక్రమించుకోవడం, భవనాలను కొల్లగొట్టడం వంటివి జరుగుతున్నాయన్నారు. ఇకనైనా కళ్లు తెరవాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. నెల్లూరులో జరిగే అక్రమాలు, దుర్మార్గాలపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి

విచారణకు పిలిచిన ఆలయ సిబ్బందిని విడుదల చేసిన ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. పోలీసుల హామీతో ఈ వివాదాన్ని ఇంతటితో వదిలి పెడుతున్నట్లు చెప్పారు. ఇలాంటి ఘటనలు జరక్కుండా చూడాలని కోరారు.