పొలం గట్టు వెంబడి వెళ్తుండగా ఒక్కటే దుర్వాసన.. ఏంటని వెళ్లి చూడగా షాక్..!
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అత్యంత పాశవిక ఘటన వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని దుండగులు ఒక యువకుడిని పెట్రోల్ పోసి తగులబెట్టి దారుణ హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఎమ్మిగనూరు పట్టణ శివారుల్లోని ఎర్రకోట గ్రామం సమీపంలో ఉన్న ఓ జిన్నింగ్ మిల్లు ఎదురుగా ఉన్న పొలంలో యువకుడి మృతదేహం కాలిపోయిన స్థితిలో కనిపించింది.

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో అత్యంత పాశవిక ఘటన వెలుగులోకి వచ్చింది. గుర్తు తెలియని దుండగులు ఒక యువకుడిని పెట్రోల్ పోసి తగులబెట్టి దారుణ హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఎమ్మిగనూరు పట్టణ శివారుల్లోని ఎర్రకోట గ్రామం సమీపంలో ఉన్న ఓ జిన్నింగ్ మిల్లు ఎదురుగా ఉన్న పొలంలో యువకుడి మృతదేహం కాలిపోయిన స్థితిలో కనిపించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఎర్రకోట గ్రామం సమీపంలోని జిన్నింగ్ మిల్లు ఎదురుగా ఉన్న పంటపొలాల్లో దుండగులు, ఒక యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. దీంతో పూర్తిగా కాలిబూడిదైన యువకుడిని స్థానికులు గమనించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించారు. ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని స్వయంగా పరిశీలించారు. మరణించిన వ్యక్తి వయస్సు సుమారు 25 నుండి 30 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహించి దర్యాప్తు చేపట్టారు.
ఈ హత్య ను ఎక్కడో చేసి ఇక్కడకు తెచ్చి మృతదేహాన్ని కాల్చివేశారా? లేక ఇక్కడే సజీవ దహనం చేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షల వల్ల ఈ హత్య జరిగిందా? లేక మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితుడు ఎవరనేది గుర్తిస్తే కేసులో పురోగతి లభిస్తుందని పోలీసులు భావిస్తున్నారు. యువకుడిని అతి దారుణంగా కాల్చి చంపారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ భార్గవి తెలిపారు. త్వరలో నిందితులను పట్టుకుని, హత్య వెనుక ఉన్న నిజాలను నిగ్గు తేలుస్తామని డీఎస్పీ వెల్లడించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
