Minister Roja: సినిమాలో ఎన్ని డైలాగులు చెప్పినా ప్రజల సమస్యలు తీరవు.. బాలకృష్ణపై మంత్రి రోజా ఫైర్..

సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యేపై మంత్రి రోజా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. చంద్రబాబు భ్రమలో నుంచి బాలకృష్ణ బయటకు రావాలని ఎద్దేవా చేశారు. స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడారా లేక తెలియక మాట్లాడారా అన్నది అర్దం..

Minister Roja: సినిమాలో ఎన్ని డైలాగులు చెప్పినా ప్రజల సమస్యలు తీరవు.. బాలకృష్ణపై మంత్రి రోజా ఫైర్..
Roja Balakrishna
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jan 16, 2023 | 7:16 AM

సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యేపై మంత్రి రోజా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. చంద్రబాబు భ్రమలో నుంచి బాలకృష్ణ బయటకు రావాలని ఎద్దేవా చేశారు. స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడారా లేక తెలియక మాట్లాడారా అన్నది అర్దం కావడం లేదన్న మంత్రి.. చంద్రబాబు రోడ్ షో లలో 11మంది చనిపోతే బాలకృష్ణ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని బాలకృష్ణ ఎమర్జెన్సీ అనడం హాస్యాస్పదమని మండిపడ్డారు. అన్‌స్టాపబుల్‌లో ఎన్టీఆర్‌పై జరిగిన చర్చ స్క్రిప్ట్‌ అని ప్రజలందరూ భావిస్తున్నారని మంత్రి రోజా అన్నారు. ఎవరు చచ్చినా పరవాలేదు. నా బావ మీటింగ్ జరగాలి. నా బావ కళ్ళలో ఆనందం చూడాలని బాలకృష్ణ అనుకుంటున్నారని విమర్శించారు. బాలకృష్ణకు ప్రజల కష్టాలు తెలియదా అని నిలదీశారు. ప్రజల సొమ్ముతో డబ్బులు సంపాదించి వారి డబ్బుతో మేడలు కట్టుకుని ఆ ప్రజలు చనిపోతే మాట్లాడరా మంత్రి రోజా.. తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మూడు పంటలు పండే భూమిని ఎవరో స్వామీజి చెప్పారని బీడు భూమి చేశారు. మహిళా సదస్సుకు రమ్మని నన్ను చంపాలని చూశారు. జీవో నంబర్ వన్ పూర్తిగా చదివితే బాలకృష్ణ తను మాట్లాడిన ఎమర్జెన్సీ అనే మాట వెనక్కి తీసుకుంటారు. సినిమాలో ఎన్ని డైలాగులు చెప్పినా చప్పట్లు కొట్టుకోవడానికే తప్ప ప్రజల సమస్యలు తీరవు. సంక్రాంతి రైతుల పండుగ. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారు.

        – మంత్రి రోజా

ఇవి కూడా చదవండి

కాగా.. మంత్రి రోజా అన్నమయ్య జిల్లాలోని సంబేపల్లి మండలం శెట్టిపల్లిలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. కుటుంబ సభ్యులతో కలిసి పండుగ చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు మంత్రి రోజా.

మరిన్ని ఏపీ వార్తల కోసం..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!