Minister Roja: గతంలో తరిమికొట్టినా.. ఇదేం ఖర్మరా బాబూ..! మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు..

|

Dec 01, 2022 | 6:47 PM

గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కల్యాణ్‌లను ఓడించి, హైదరాబాద్ తరిమేసినా.. మళ్లీ మళ్లీ ఆంధ్రప్రదేశ్‌కు టూరిస్టుల్లా వస్తున్నారంటూ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. ‘ఇదేం ఖర్మరా.. బాబూ’ అంటూ..

Minister Roja: గతంలో తరిమికొట్టినా.. ఇదేం ఖర్మరా బాబూ..! మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు..
Minister Roja
Follow us on

Minister Roja on Chandrababu: గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కల్యాణ్‌లను ఓడించి, హైదరాబాద్ తరిమేసినా.. మళ్లీ మళ్లీ ఆంధ్రప్రదేశ్‌కు టూరిస్టుల్లా వస్తున్నారంటూ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. ‘ఇదేం ఖర్మరా.. బాబూ’ అంటూ ప్రజలంతా నెత్తినోరు కొట్టుకుంటున్నా.. వారి ప్రవర్తన అలానే ఉందన్నారు. తన పాలనను చూసి ఓటెయ్యండని చెప్పే దమ్ము, ధైర్యం లేని చంద్రబాబు, తన భార్యపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ డ్రామాలు ఆడారన్నారు. సింపతీ రాలేదన్న కారణంతో బాదుడు అంటూ పర్యటనలు చేస్తే.. తనపై రాళ్లు వేశారంటూ మరో డ్రామా ఆడారని వివరించారు. అది కూడా సక్సెస్ కాలేదని.. చివరకు ఇదే చివరి అవకాశం అని, ఒక్క అవకాశం ఇవ్వాలని చంద్రబాబు అడుగుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు గురువారం మీడియాతో మాట్లాడారు.

1995లో ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. 30 ఏళ్ల తర్వాత మళ్లీ చివరి ఛాన్స్.. ఒక్క ఛాన్స్ ప్లీజ్.. అని అంటుంటే రాష్ట్ర ప్రజలు ఇదేమి ఖర్మరా బాబు.. అని అంటున్నారని రోజా ఎద్దెవా చేశారు. చంద్రబాబు కుప్పంలో శాశ్వతంగా నీటి సమస్యకు పరిష్కారం చూపించలేదని పేర్కొన్నారు. చంద్రబాబు పేరు చెబితే.. ఒక్క స్కీమూ గుర్తుకురాదన్నారు. డ్వాక్రా రుణ మాఫీ చేస్తానని.. మోసం చేశారన్నారు. 44 ఏళ్ళ తన రాజకీయ చరిత్రలో చంద్రబాబు, రైతులకు చేసిన న్యాయం గానీ, మంచిగానీ ఒక్కటి కూడా గుర్తుకు వచ్చే పరిస్థితి లేదని విమర్శించారు. ఆయన పేరు చెబితే గుర్తొచ్చేవి వెన్నుపోటు, దగా, మోసం, వంచనలేనన్నారు. అన్నీ రంగాలను దెబ్బతీశారని.. అన్ని సామాజిక వర్గాలకు దగా చేశారని విమర్శించారు.

రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి జగనన్న.. ఒక కొడుకులా తోడున్నారంటూ రోజా పేర్కొన్నా3రు. తన సుదీర్ఘ పాదయాత్రలో చూసిన ప్రజల కష్టాలను దూరం చేసేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో 98శాతం మేర మూడున్నరేళ్ళలోనే నెరవేర్చారన్నారు. సంక్షేమం, అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ.. రాష్ట్రాన్ని ప్రగతిపథం వైపు నడిపిస్తున్నారని తెలిపారు. వైయస్సార్ ప్రారంభించిన పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేయకుండా, మట్టికట్టలను చూపించేందుకు వందలకోట్లు ఖర్చు పెట్టి బస్సుల్లో జనాలను తీసుకువెళ్లారంటూ విమర్శించారు. ప్రధాని మోదీ సహా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా జగన్ పరిపాలనను ప్రశంసిస్తున్నారని తెలిపారు. అలాంటి జగనన్న పుట్టినరోజు పండుగను అందరం కలిసి చేసుకుందామంటూ రోజా పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..