కాళ్ళతో తన్ని .. తిండి పెట్టకుండా నరకం చూపించారు.. చివరికి మంత్రి చొరవతో..!
కువైట్ దేశంలో పనికి వెళ్లిన వారి కష్టాలు మామూలుగా ఉండవు. అయితే రాజయోగం.. లేదంటే నరకమే..! అక్కడ వెళ్లిన 100 మందిలో కనీసం పది మంది అయినా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి బాధలు కొత్తవి కాకపోయినా.. ఓ మహిళ ఈ మధ్య పంపించిన సెల్ఫీ వీడియో ఆమె బాధను, ఆవేదనను కొట్టొచ్చినట్లు చూపిస్తోంది.
కువైట్ దేశంలో పనికి వెళ్లిన వారి కష్టాలు మామూలుగా ఉండవు. అయితే రాజయోగం.. లేదంటే నరకమే..! అక్కడ వెళ్లిన 100 మందిలో కనీసం పది మంది అయినా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి బాధలు కొత్తవి కాకపోయినా.. ఓ మహిళ ఈ మధ్య పంపించిన సెల్ఫీ వీడియో ఆమె బాధను, ఆవేదనను కొట్టొచ్చినట్లు చూపిస్తోంది. కనీసం అన్నం పెట్టకుండా పనులు చేయించుకుంటూ రేయింబవళ్ళు శ్రమ దోపిడీ చేస్తున్న కువైటీల ఆగడాలపై ఆ మహిళ తన ఆవేదనను వ్యక్తం చేసింది.
అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి నగరానికి పక్కనే ఉన్న పల్లెలో తిరుపతి కవిత అనే మహిళ ఆమె భర్త నివాసం ఉంటున్నారు. అయితే భర్త అంగవైకల్యం కారణంగా చిన్నాచితకా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అక్కడ జీవనోపాధి పొంది కుటుంబాన్ని ఆదుకోవచ్చు అనే ఉద్దేశంతో కువైట్‌లోని ఓ ఇంట్లో పని చేయడానికి వెళ్లిన కవితకు అక్కడ చుక్కలు కనపడ్డాయి. కువైట్ లో పనికి కుదిరిన దగ్గర నుంచి మొదటి పది రోజులు బాగానే ఉన్నా, తర్వాత నుంచి కువైట్‌లోని ఇంటి యజమానులు ఆమెకు నరకం చూపించారని కవిత తన ఆవేదనను వ్యక్తం చేసింది.
అర్ధరాత్రి వరకు పనులు చేయించుకునే వారని, కనీసం తిండి కూడా పెట్టకుండా నానా ఇబ్బందులు పెట్టారని కవిత వాపోయింది. ఉదయం 7 గంటలకు పని మొదలైతే రాత్రి రెండు వరకు ఇంట్లో పని చేస్తూనే ఉండాలని బాత్రూంలో కడిగే దగ్గర నుంచి పిల్లలను ఎత్తుకుని ఆడించి, ఇంటి పని, వంట పని అన్ని చేయాలని ఆదేశించేవారు. ఇంత చేసిన కనీసం కనికరం లేకుండా చూసేవారని కవిత తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని తనను కువైట్ తీసుకెళ్లిన ఏజెంట్ కు చెప్పగా అతను కూడా పట్టించుకోలేదు. దీంతో చేసేదేమీ లేక తన భర్తకు ఈ విషయాన్ని చేరవేసింది కవిత.
వీడియో చూడండి..
సెల్ఫీ వీడియో తీసి పంపించడంతో ఆ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డికి చేరింది. ఆయన చొరవతో ఇండియాకు తిరిగి వచ్చానని కవిత వాపోయింది. సెల్ఫీ వీడియో తీసి తన భర్తకు పంపించినందుకు సైతం కువైట్ లో ఇంటి యజమాని తనను బెదిరించారని తెలిపింది. మొత్తం మీద కవిత సెల్ఫీ వీడియో సాయంతో ఇండియాకు తిరిగి రావడంతో కథ సుఖాంతమైంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..