Balineni Srinivasa Reddy: టీడీపీలో చేరడం చారిత్రక తప్పిదం.. వంగవీటిపై మంత్రి బాలినేని కామెంట్స్

Srinivasa Reddy on Vangaveeti Radha: వంగవీటి రాధ వ్యాఖ్యలపై ఏపీలో దుమారం కొనసాగుతోంది. తనను చంపేందుకు రెక్కి నిర్వహించారని వంగవీటి రాధ చేసిన కామెంట్స్‌ రాష్ట్రంలో రాజకీయ వేడిని

Balineni Srinivasa Reddy: టీడీపీలో చేరడం చారిత్రక తప్పిదం.. వంగవీటిపై మంత్రి బాలినేని కామెంట్స్
Balineni Srinivasa Reddy

Updated on: Dec 29, 2021 | 2:38 PM

Srinivasa Reddy on Vangaveeti Radha: వంగవీటి రాధ వ్యాఖ్యలపై ఏపీలో దుమారం కొనసాగుతోంది. తనను చంపేందుకు రెక్కి నిర్వహించారని వంగవీటి రాధ చేసిన కామెంట్స్‌ రాష్ట్రంలో రాజకీయ వేడిని పెంచాయి. రాధా చేసిన వ్యాఖ్యలపై ఏపీ విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరడం చారిత్రక తప్పిదమని ఏపీ విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. తన తండ్రిని హత్య చేయించిన పార్టీలో రాధా చేరకుండా ఉండాల్సిందని శ్రీనివాస్ రెడ్డి సూచించారు. రంగాను హత్య చేయడం వెనుక చంద్రబాబు హస్తం ఉందంటూ బాలినేని ఆరోపించారు. రాధా ఆయన వైసీపీ పార్టీలోకి రావాలనుకుంటే సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవచ్చని స్సష్టం చేశారు. అయితే ఇప్పటికే ఆయనకు నియోజకవర్గం రిజర్వ్‌ చేశారనడం అవాస్తవమంటూ బాలినేని తెలిపారు. వంగవీటి రాధా ఏ పార్టీలో ఉన్నా రంగా ఫ్యామిలీపై సీఎం వైయస్‌ జగన్‌కు, తమకు ఎంతో గౌరవం ఉందన్నారు.

తనను హత్య చేసేందుకు రెక్కీ నిర్వాహించాని రాధా వ్యాఖ్యలు చేసినందున ప్రభుత్వం అదనంగా గన్‌మెన్లను కేటాయించిందన్నారు. అయితే ఆయన గన్‌మెన్లు వద్దనుకోవడం ఆయన వ్యక్తిగతమంటూ బాలినేని పేర్కొన్నారు. టీడీపీ పార్టీపై దాడి జరిగిన రోజే రాధాను హత్య చేసేందుకు రెక్కీ చేశారన్న విషయం నెలరోజుల తరువాత బయటపెట్టడం వెనుక దురుద్దేశాలు ఉన్నాయేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయంటూ మంత్రి బాలినేని విమర్శించారు.

Also Read:

Vangaveeti: వంగవీటి రాధ వ్యవహారంలో మరో ట్విస్ట్.. ఐసీయులో ఉన్న వ్యక్తి రెక్కీ ఎలా చేశారు?

Andhra Pradesh: ఏపీలో పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై 2500.. ఉత్తర్వులు జారీ