విశాఖ వేదికగా ప్రధాని మోడీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ ముగిసిందో లేదో.. వెంటనే మంత్రి అంబటి రాంబాబు రంగంలోకి దిగారు. ట్విట్టర్ వేదికగా పవన్ పై వ్యంగ్యాస్త్ర బాణాలు విసిరేశారు. వ్యంగాస్త్రాలన్నీ తన జేబులో పెట్టుకుని తిరుగుతున్నట్టు కనిపించే అంబటి.. పవన్‌పై మరోసారి అదేస్థాయిలో సెటైర్లు వేశారు. మోడీ తో మీటింగు.. బాబుతో డేటింగు అంటూ.. తనదైన స్టయిల్‌లో పవన్‌ను టార్గెట్ చేశారు. అయితే ఇటీవల జరిగిన పరిణామాల ఆధారంగానే అంబటి రాంబాబు ఈ విధంగా కామెంట్ చేశారన్నది స్పష్టమవుతూనే ఉంది. విశాఖ ఎపిసోడ్ తర్వాత..విజయవాడకు చేరుకున్న పవన్ కల్యాణ్‌ను హుటాహుటిన చంద్రబాబు కలవడం.. ఇద్దరూ కలిసి చాలాసేపు చర్చించుకోవడం.. కలిసి ముందుకు సాగడంపై క్లారిటీ ఇవ్వడం.. ఈ పొలిటికల్‌హీట్‌కు కారణమన్న మాట. దాన్ని బేస్ చేసుకునే… అటు బాబుతో డేటింగ్‌లో ఉంటూనే, ఇటు మోడీ తో పవన్ మీటింగ్ పెట్టుకున్నారని తన ట్విట్టర్ పోస్టులో రాసుకొచ్చారు అంబటి. ఏం చేసినా చివరాఖరుకు చంద్రబాబుకు మేలు చేయాలన్నదే పవన్ ఆలోచన అనేది అంబటి ఆరోపణ.
మోడీతో మీటింగు !
బాబుతో డేటింగ్ !— Ambati Rambabu (@AmbatiRambabu) November 11, 2022
టీడీపీకి పవన్ దగ్గరవడంపై ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేశారా? అనే చర్చ జరుగుతోందిప్పుడు. పొలిటికల్‌గా వైసీపీ రెయిస్ చేసిన అంశమే అయినా… లాజిక్కే అనేవారు లేకపోలేదు. మోదీతో భేటీ తర్వాత బయటికొచ్చిన పవన్‌లో అసంతృప్తి కొట్టొచ్చినట్టు కనిపించిందని, ఇప్పటికే ఓ వర్గం ప్రచారం మొదలెట్టేసినట్టు సమాచారం.
పవన్, మోదీ భేటీలో ఏం మాట్లాడుకున్నారు? ఏం చర్చించారు? అనే విషయం పక్కనపెడితే ఏపీలో పొలిటికల్‌గా మాత్రం… మరోసారి ఇదో కుదుపు.
ఎవరేమాన్నా… ఎవరెన్ని విమర్శలు చేసినా… పవన్, మోదీల భేటీ… ఏపీ రాజకీయాల్లో ఏవిధమైన మార్పులకు శ్రీకారం చుడుతుందనేది కొన్నాళ్లాగితే తప్ప తెలియదు. ఎందుకంటే అసలు కథ ముందు ముందు తెలుస్తుందన్నది రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. ఎందుకంటే, పైనున్నది మామూలు నాయకుడు కాదు.. నరేంద్ర మోదీ.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..