Minister Ambati Rambabu: ఏపీలో ముందస్తు ఎన్నికలు.. మంత్రి అంబటి రాంబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

|

Jan 29, 2023 | 1:13 PM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు అధికార పక్షం అంతే దీటుగా సమాధానమిస్తోంది. తాజాగా.. లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఏపీ పాలిటిక్స్ లో హీట్..

Minister Ambati Rambabu: ఏపీలో ముందస్తు ఎన్నికలు.. మంత్రి అంబటి రాంబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Minister Ambati Rambabu
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు అధికార పక్షం అంతే దీటుగా సమాధానమిస్తోంది. తాజాగా.. లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఏపీ పాలిటిక్స్ లో హీట్ పెంచుతోంది. పాదయాత్రలో అధికారపక్షం పై లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు, విమర్శలు చేస్తున్నారు. వాటికి అంతే గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు. ఈ పరిస్థితుల నడుమ ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు వస్తాయనే వార్తలు గుప్పుమన్నాయి. కాగా.. వీటిపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు అవకాశమే లేదని స్పష్టం చేశారు. ముందస్తు పేరుతో ప్రతిపక్షాలు వారి పార్టీలో సీట్ల కోసం నాయకులను నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఎంతమంది కలిసి పోటీ చేసినా వైసీపీ విజయాన్ని అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని స్పష్టం చేశారు మంత్రి అంబటి రాంబాబు.

మరోవైపు.. టీడీపీ లీడర్ నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్రపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు మంత్రి అంబటి. లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర వెలవెలబోయిందని మంత్రి అంబటి అన్నారు. లోకేష్‌ది యువగళం కాదు.. యువ గరళం అంటూ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. లోకేశ్ చిత్తశుద్ధిలేని పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు. ఇంతకీ సీఎం అభ్యర్థి ఎవరో వారికే క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు అంబటి రాంబాబు.

లోకేశ్ ఎన్ని పాదయాత్రలు చేసినా, ఆయన నాయకుడు కాలేరు. నాయకుడికి కొన్ని లక్షణాలు ఉండాలి. అవి లోకేశ్ కు లేవు. పాదయాత్రతో వచ్చినా.. వారాహితో వచ్చినా అంతా హాస్యమే. పవన్‌ నోటికి అడ్డూ అదుపు లేదు. తన అర్హతలను ప్రశ్నిస్తున్నారని.. కానీ తాను మంత్రిగా ఎంతో సేవ చేశానని, రోడ్లు వేయించానని, చెట్టు నాటానని ఏదేదో లోకేష్ చెప్తున్నారన్న అంబటి రాంబాబు.. లోకేష్‌కూ ఏ అర్హతా లేదని మండిపడ్డారు. పాదయాత్ర చేసినంత మాత్రాన టీజీపీ అధికారంలోకి వస్తుందని భావించడం వారి అమాయకత్వానికి నిదర్శనంగా మారిందని ఎద్దేవా చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం