AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ambati Rambabu: పవన్ సక్సెస్ ఫుల్ యాక్టర్ .. ఫెయిల్యూర్ పొలిటీషియన్.. మంత్రి అంబటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

రాజకీయ ప్రస్థానంపై సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పై మంత్రి అంబటి రాంబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. నిన్న, నేడు, రేపు ఇలా పవన్ కల్యాణ్ ఎప్పటికీ ఫెయిల్యూర్ పొలిటీషియనే...

Ambati Rambabu: పవన్ సక్సెస్ ఫుల్ యాక్టర్ .. ఫెయిల్యూర్ పొలిటీషియన్.. మంత్రి అంబటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Ambati Rambabu
Ganesh Mudavath
|

Updated on: Dec 04, 2022 | 12:48 PM

Share

రాజకీయ ప్రస్థానంపై సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పై మంత్రి అంబటి రాంబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. నిన్న, నేడు, రేపు ఇలా పవన్ కల్యాణ్ ఎప్పటికీ ఫెయిల్యూర్ పొలిటీషియనే అన్నారు. పవన్ చాలా ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. ఎప్పుడు గెలవలేదని విమర్శించారు. పొలిటికల్ గా ఆయన పాత్రను సరిగా నిర్వహించలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. పవన్ సక్సెస్ ఫుల్ యాక్టర్ .. ఫెయిల్యూర్ పొలిటీషియన్ అనేది వాస్తవమన్నారు. రాజకీయాల్లో మాత్రం ఆయన సక్సెస్ అయ్యే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. పవన్ కళ్యాణ్ కు సిద్ధాంతపురమైన విధానం లేదన్న అంబటి.. విప్లవ నాయకుడిగా పార్టీని ప్రారంభించి సిద్ధాంతాలకు విరుద్ధమైన కమ్యూనిస్టులు, బీజేపీ లతో విడివిడిగా జతకట్టారని ఆరోపించారు. తనకు తాను చేగువేరాగా చెప్పుకున్న పవన్.. రాజకీయాల్లో ఘోరంగా విఫలమయ్యారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కాగా.. తన రాజకీయ ప్రస్థానంపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైతే తానొక ఫెయిల్యూర్ పొలిటీషియన్‌ నంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. గెలుపైనా, ఓటమైనా రెండూ గమనాలే తప్ప గమ్యాలు కాదన్నారు. అనవసరంగా గెలుపోటములను అతిగా తలకు ఎక్కించుకోవద్దన్న పవన్.. అప్పుడే అనుకున్న అసలు టార్గెట్ రీచ్ కాగలమంటూ విద్యార్థులను మోటివేట్ చేశారు.

ఇప్పటికైతే నేనొక ఫెయిల్యూర్ పొలిటీషియన్‌. ఓటమి అనేది విజయానికి సగం పునాది. డబ్బున్న వాళ్లంతా గొప్పోళ్లు, పేరున్న వాళ్లంతా మహానుభావులు అనుకోవద్దు. ప్రతి ఒక్కరినీ గుడ్డిగా నమ్మొద్దు. దేవుడిని కూడా గుడ్డిగా నమ్మొద్దు. ఏది తప్పు.. ఏది ఒప్పు అనేది నిర్ణయించుకోవాలి. మన వ్యక్తిగత విజయమే దేశానికి పెట్టుబడి.

ఇవి కూడా చదవండి

– పవన్ కల్యాణ్, జనసేన అధినేత

మరిన్ని ఏపీ వార్తల కోసం..