Earthquake: ఒంగోలులో భూప్రకంపనలు .. మూడు సెకన్ల పాటు కంపించిన భూమి.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం

|

Jul 10, 2023 | 7:16 AM

ఒంగోలులో వరుస భూకంపాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. గ్రానేట్ క్వారీలకు, ఒంగోలు లో భూప్రకంనలకు సంబంధం ఉందంటూ నగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదికి ఒకసారైనా ఇలా జరుగుతోందని వాపోతున్నారు నగర వాసులు. 

Earthquake: ఒంగోలులో భూప్రకంపనలు .. మూడు సెకన్ల పాటు కంపించిన భూమి.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం
Earthquake In Ongole
Follow us on

ప్రకాశం జిల్లా హెడ్ క్వాటర్‌ ఒంగోలులో భూప్రకంపనలు కలకలం రేపుతున్నాయి. రెండు మూడు సెకన్ల పాటు స్వల్పంగా భూమి కంపించడంతో ఏం జరుగుతుందో తెలియక ఇళ్లలోనుంచి జనాలు పరుగులు తీశారు. కేవలం రెండు, మూడ సెకన్ల పాటు మాత్రమే రావడంతో ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం జరగలేదు. దీంతో నగరవాసులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన ఒంగోలు టౌన్‌లోని వడ్డెపాలెం, విజయనగర్‌ కాలనీ, సిఆర్‌పి క్వార్టర్స్‌ ప్రాంతాలలో ఆదివారం సాయంత్రం 5 గంటల 4 నిమిషాల సమయంలో జరిగింది. ఆ సమయంలో ఇళ్ళల్లో ఉన్న సామాన్లు కదలడం.. శబ్దం చేయడంతో భూప్రకంపనలు జరిగినట్లు నిర్ధారణకు వచ్చారు. గతంలో ఒంగోలులో ఇలాగే చాలాసార్లు భూమి కంపించిందని.. ఏడాదికి ఒక్కసారైనా ఇలా జరుగుతుందని ఒంగోలు నగర వాసులు చెప్తున్నారు. ఒంగోలులో కొండ ప్రాంతం దిగువన తరచుగా భూమి కంపిస్తున్నట్టు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తరుచు ఒంగోలులో భూప్రకంనలకు గ్రానేట్ క్వారీలే కారణమని అంటున్నారు పలువురు. ఒంగోలుకు సమీపంలోని చీమకుర్తి, సంతనూతలపాడు మండలాల్లో పలు గ్రానైట్ క్వారీలు కారణంగా భూమి కంపిస్తుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోమైపు భూకంపాలు వచ్చినప్పుడు ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఇళ్లలో నుంచి బయటకు వచ్చి ఖాళీ స్థలాల్లో ఉండాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..