Arasavalli Temple: అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న సాయి ధరమ్ తేజ్.. ఆరోగ్యం బాగుండాలని మొక్కుకున్న మెగా హీరో..

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దర్శనానికి 2014 లో వచ్చానని ఆతరువాత మళ్ళీ ఇదే రావటమని ఈ సందర్భంగా సినీ హీరో సాయి ధరంతేజ్ తెలిపారు. ఆరోగ్యం బాగుండాలని స్వామి వారిని మొక్కుకున్నట్లు చెప్పారు. తాను నటించిన బ్రో మూవీ ట్రెయిలర్ శనివారం విడుదలవుతుందని, ఈనెల 28న సినిమా రిలీజ్ అవుతుందని అన్నారు.

Arasavalli Temple: అరసవల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న సాయి ధరమ్ తేజ్.. ఆరోగ్యం బాగుండాలని మొక్కుకున్న మెగా హీరో..
Teju At Arasavalli Temple

Edited By:

Updated on: Jul 21, 2023 | 3:00 PM

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ శ్రీకాకుళంలో సందడి చేశారు. ప్రత్యక్షదైవం, ఆరోగ్య ప్రదాత అయిన శ్రీకాకుళం అరసవల్లి లోని శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకుని ..స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన సాయిధరమ్ తేజ్ కు ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం ఆలయంలోని అనివెట్టి మండపంలో అర్చకులు సాయి ధరమ్ తేజ్ కి వేద మంత్రాలతో ఆశీర్వాదాన్ని అందించారు. ఆలయ ఈవో వి.హరి సూర్య ప్రకాష్.. స్వామి వారి ప్రసాదం, జ్ఞాపికను సాయి ధరమ్ తేజ్ కి అందజేశారు.

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దర్శనానికి 2014 లో వచ్చానని ఆతరువాత మళ్ళీ ఇదే రావటమని ఈ సందర్భంగా సినీ హీరో సాయి ధరంతేజ్ తెలిపారు. ఆరోగ్యం బాగుండాలని స్వామి వారిని మొక్కుకున్నట్లు చెప్పారు. తాను నటించిన బ్రో మూవీ ట్రెయిలర్ శనివారం విడుదలవుతుందని, ఈనెల 28న సినిమా రిలీజ్ అవుతుందని అన్నారు. తన గురువు గారితో కలిసి నటించిన సినిమా ఆని పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి చెప్పారు. ఆడియన్స్ అంచనాలకు మించి సినిమా బాగుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా ప్రతినిధులతో పాటు ఆలయ పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. ఆలయ దర్శనానికి వచ్చిన సాయి ధరమ్ తేజ్ ను చూసేందుకు మెగా అభిమానులు, పలువురు భక్తులు ఎగబడ్డారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..