AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పగలు భక్తులు.. రాత్రయితే దొంగలు.. దేవుడి సొమ్ము ఎలా దోచుకుంటున్నారో తెలుసా..?

మార్కాపురం జిల్లాలో దేవాలయాలను టార్గెట్‌ చేసి వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పగలు బేల్దారి కూలీలుగా పనిచేస్తూ దేవాలయాల్లో భక్తుల ముసుగులో రెక్కీ చేసి, రాత్రిళ్లు చోరీలకు పాల్పడుతున్న 13 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.22.70 లక్షల విలువైన నగలు, విగ్రహాలు, రెండు కార్లు, రెండు బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పగలు భక్తులు.. రాత్రయితే దొంగలు.. దేవుడి సొమ్ము ఎలా దోచుకుంటున్నారో తెలుసా..?
Markapuram Temple Theft
Fairoz Baig
| Edited By: |

Updated on: Sep 08, 2026 | 6:04 PM

Share

వారంతా ఇంటి నిర్మాణ పనులు చేసుకునే.. బేల్దారి కూలీలు.. వీరికి ఓ పూజారి తోడవడంతో పనులు మానేసి పగలు దేవాలయాల్లో భక్తులుగా చలామణి అవుతూ రాత్రిళ్ళు అదే దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్నారు.. ఇళ్ల నిర్మాణ పనులు చేస్తున్నట్టు నటిస్తూ దేవాలయాల్లో పూజలు కూడా చేసేవాళ్ళు.. పూజలు చేసే సమయంలో భక్తులుగా చలామణి అవుతూ దేవాలయం రూపు రేఖలను పరిశీలించి రెక్కీ చేసేవాళ్ళు.. అనంతరం అనువైన సమయం చూసుకుని దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్నారు.

ఎట్టకేలకు పట్టుబడ్డ దొంగలు..

మార్కాపురం జిల్లాలోని పలు దేవాలయాలలో చోరీలకు పాల్పడుతున్న 13 మందిని అరెస్ట్‌ చేసి నిందితులను నుంచి 22 లక్షల 70 వేల రూపాయల విలువైన నగలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.. మార్కాపురం జిల్లా సియస్ పురం, పామూరు, కనిగిరి, కొనకనమెట్ల మండలాల్లో పలు దేవాలయాలలో ఇటీవల వరుస చోరీలు జరుగుతున్న నేపధ్యంలో సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను అరెస్ట్‌ చేశారు.

చోరీలు జరిగింది ఇలా..

ఇటీవల కాలంలో మార్కాపురం జిల్లా పరిధిలోని సి.ఎస్.పురం, పామూరు, కనిగిరి, కొనకనమిట్ల మండలాల్లోని పలు దేవాలయాలలో వరుసగా చోరీలు జరిగాయి. ఈ వరుస చోరీలకు పాల్పడుతున్నది ఒకే ముఠాలోని సభ్యులుగా గుర్తించిన పోలీసులు నేరస్థుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎస్‌పిగా ఉన్న హర్షవర్ధన్ రాజు ఈ కేసులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎస్‌పి నిరంతర పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కనిగిరి డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో పామూరు సీఐ వినోద్ కుమార్, కనిగిరి సీఐ శ్రీనివాసరావు, సి.ఎస్.పురం, వెలిగండ్ల, పామూరు, కొనకనమిట్ల, పిసీ పల్లి పోలీస్ స్టేషన్ల ఎస్ఐ లు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కేసులను వివిధ కోణాల్లో దర్యాప్తు చేశారు. సాంకేతిక ఆధారాలను సేకరించి, ఆయా గ్రామాల్లో ఇన్‌ఫార్మర్లను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా అందిన విశ్వసనీయ సమాచారాన్ని విశ్లేషిస్తూ దర్యాప్తు కొనసాగించారు. ఈ క్రమంలో పామూరు మండలం రావిగుంటపల్లి గ్రామ శివారులో దేవాలయల్లో చోరీలకు పాల్పుడిన 13 మంది నిందితులను అరెస్టు చేశారు.

పగలు రెక్కీ.. రాత్రిళ్ళు చోరీ..

నిందితులంతా ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. వీరంతా పగలు బేల్దారు పనులు, స్లాబ్ మిల్లర్ పనులు చేస్తూ ఉంటారు. పగలు బేల్దారి పనులు చేసుకుంటూ రాత్రిళ్ళు దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. పనుల నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లే క్రమంలో ఒకరికొకరు పరిచయం ఏర్పడింది. వీరిలో విష్ణువర్ధన్ ఒక ప్రైవేట్ వెంచర్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తుండగా, అతనికి సుబ్బారావు తోడుగా ఉండేవాడు. వీరిలో పాత నేరస్తుడైన సోమేపల్లి ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి ఒక దేవాలయంలో పూజారిగా పనిచేస్తూ, దేవాలయాల్లో చోరీలకు పాల్పడి సులభంగా డబ్బు సంపాదించవచ్చనే సలహాలు ఇచ్చేవాడు. కొమరోలు మండలానికి చెందిన బాల గురవయ్య చోరీ చేసిన సొత్తును స్వీకరించే రిసీవర్‌గా ఉండేవాడు. ఈ విధంగా దేవాలయాలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడటం మొదలుపెట్టారు. ఈ క్రమంలో పలు దేవాలయాలను ముందుగా గుర్తించి, అక్కడి పరిస్థితులను పరిశీలిస్తూ రెక్కీలు చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నట్టు ఎస్‌పి హర్షవర్ధన్‌రాజు తెలిపారు. నిందితుల నుంచి 22 లక్షల 70 వేల రూపాయల విలువైన నగలు, విగ్రహాలు, రెండు కార్లు, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

Follow Us
పగలు భక్తులు.. రాత్రయితే దొంగలు.. దేవుడి సొమ్మునే దోచేస్తున్నారు
పగలు భక్తులు.. రాత్రయితే దొంగలు.. దేవుడి సొమ్మునే దోచేస్తున్నారు
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలకు షాక్.. భారీగా ఎక్స్‌పైరీ ఫుడ్ సీజ్!
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీలకు షాక్.. భారీగా ఎక్స్‌పైరీ ఫుడ్ సీజ్!
ఇట్స్ అఫీషియల్.. OTTలో సూర్య బ్లాక్ బస్టర్ 'విశ్వనాథ్ అండ్ సన్స్'
ఇట్స్ అఫీషియల్.. OTTలో సూర్య బ్లాక్ బస్టర్ 'విశ్వనాథ్ అండ్ సన్స్'
అర్థరాత్రి మరిన్ని రూట్లలో నైట్ షిఫ్ట్ బస్సు సర్వీసులు..
అర్థరాత్రి మరిన్ని రూట్లలో నైట్ షిఫ్ట్ బస్సు సర్వీసులు..
చికెన్ బిర్యానీని కుక్కర్‌లో ఇలా చేస్తే అద్భుతం అంతే...
చికెన్ బిర్యానీని కుక్కర్‌లో ఇలా చేస్తే అద్భుతం అంతే...
మహిళల్లో గుండెపోటు తీవ్ర సంకేతాలు..ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!
మహిళల్లో గుండెపోటు తీవ్ర సంకేతాలు..ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!
ఒకే బ్రాండ్.. రెండు న్యాయాలా? ఫాంటాలో 3 స్పూన్ల చక్కెర..!
ఒకే బ్రాండ్.. రెండు న్యాయాలా? ఫాంటాలో 3 స్పూన్ల చక్కెర..!
తక్కువ సమయంలో మీ ఒంటికి ఎక్కువ రక్తం పట్టాలా..ఈ లడ్డూ తినాల్సిందే
తక్కువ సమయంలో మీ ఒంటికి ఎక్కువ రక్తం పట్టాలా..ఈ లడ్డూ తినాల్సిందే
ఖాతాలో డబ్బు ఉందా? ఇలా చేస్తే భారీగా వడ్డీ వస్తుందని తెలుసా?
ఖాతాలో డబ్బు ఉందా? ఇలా చేస్తే భారీగా వడ్డీ వస్తుందని తెలుసా?
ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తీర్మానం
ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తీర్మానం