Andhra Pradesh: వారి ఆచూకి కోసం మరో రెండు పెద్ద బోట్లు.. సముద్రంలో మెరైన్ పోలీసులు..

|

Jul 07, 2022 | 8:12 AM

చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారుల జాడ ఇంకా తెలియలేదు. సమాచారం తెలియక వారి కుటుంబాలు తల్లడిల్లిపోతున్నాయి.. క్షేమంగా తిరిగి రావాలంటూ గంగమ్మకు పూజలు చేశారు.. మత్స్యకారుల కోసం గాలింపు కొనసాగుతోందని అధికారులు, నాయకులు చెబుతున్నారు.

Andhra Pradesh: వారి ఆచూకి కోసం మరో రెండు పెద్ద బోట్లు.. సముద్రంలో మెరైన్ పోలీసులు..
Marine Police
Follow us on

ఆరు రోజులు గడిచినా దొరకని నలుగురి మత్స్యకారుల ఆచూకీ.. మెరైన్, నేవీ, కోస్ట్ గార్డు బృందాల గాలింపు.. శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకూ తీరప్రాంతంలో గస్తీ ముమ్మరం చేశారు. మచిలీపట్నంలో క్యామిలిపేట నుంచి నలుగు జాలర్లు జులై 2వ తేదీన సముద్రంలో వేటకు వెళ్లారు. బోటు చెడిపోయిందని 3వ తేదీన వారిని ఫోన్‌ వచ్చింది. ఆ తర్వాత కమ్యూనికేషన్‌ కూడా కటైపోయింది.. సాయం కోసం సముద్రంలోకి వెళ్లిన మరో బోటుకు ఎక్కడగా ఆ బోటు కనిపించపోవడంతో తిరిగి వచ్చేసింది. దీంతో మత్స్యకారుల కుటుంబాలు తల్లడిల్లిపోతున్నాయి. అయితే గల్లంతైన మత్స్యకారుల ఆచూకిని కనిపెట్టేందుకు గురువారం కూడా మరో రెండు పెద్ద బోట్లతో సముద్రంలోకి మత్స్యకారులు వెళ్తున్నారు. వీరికితోడుగా మెరైన్ బోట్లలో మూడు రోజుల ఆహారంతో సముద్రంలోకి మెరైన్ పోలీసులు కూడా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే వీర, ప్రియదర్శిని నౌకలు ఇప్పటికే గాలింపు కొనసాగిస్తున్నాయి. ఇవాళ కూడా హెలికాప్టర్ తో గాలింపు చర్యలు కొనసాగింపు చేపట్టనున్నారు. సముద్రంలో మత్స్యకారుల కోసం ముమ్మర గాలింపు చేస్తున్నారు.

సముద్రంలోకి వెళ్లిన ఆ నలుగురు జాలర్ల పరిస్థితి ఏమిటి? వారు క్షేమంగానే ఉన్నారా?.. వారు క్షేమంగానే ఉంటే ఐదో తేదీ రాత్రికి తిరిగి తీరం రావాలి.. కానీ ఇప్పటి వరకూ రాలేదు.. దీంతో మత్స్యకారుల కుటుంబాల్లో ఆందోళన మరింత పెరిగిపోయింది.. తమ వారు క్షేమంగా తిరిగి రావాలంటూ గంగమ్మకు పూజలు చేసి సముద్రాన్ని వేడుకున్నారు.

గల్లంతైన మత్స్యకారులను వెతికేందుకు అటు నేవీ.. ఇటు కోస్ట్‌గార్డులు సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నారు. అయినా ఇప్పటి వరకు ఫలితం లేదు.. తమ వారిని ఎలాగైనా కాపాడాలని మత్స్యకారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్నినాని వారిని కులుసుకున్నారు.. గల్లంతైన మత్స్యకారులు క్షేమంగానే ఉండే అవకాశం ఉందని ధైర్యంగా ఉండాలని వారిని సముదాయించారు.

ఇవి కూడా చదవండి

టీడీపీ నాయకులు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కూడా మత్స్యకారుల కుటుంబాలను కలుసుకున్నారు గాలింపు చర్యల కోసం మరింత పెద్ద బోట్లను ఉపయోగించాలని సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశారు. గల్లంతైన మత్స్యకారుల బోట్‌ జాడ తెలుసుకునేందుకు గాలింపు చర్యల్లో భాగంగా చెన్నై నుంచి డోర్నియర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ను ప్రత్యేకంగా తెప్పించినట్లు మచిలీపట్నం జాయింట్‌ కలెక్టర్‌ మహేష్‌ కుమార్‌ చెబుతున్నారు.

బంగాళాఖాతంలో దక్షిణం నుంచి ఉత్తరం దిశగా బలమైన గాలులు వీస్తున్నందున గల్లంతైన జాలర్ల కోసం అంతర్వేది నుంచి కోల్‌కతా వరకు సముద్రంలో గాలింపు ముమ్మరంగా సాగుతోంది.

ఏపీ వార్తల కోసం