ముందు ఒరిస్సా రిజిస్ట్రేషన్.. వెనుక ఏపీ నెంబర్.. అనుమానంతో చెక్ చేస్తే షాక్..!

తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కామరాజుపేట శివారులో పుష్ప సినిమా తరహాలో గంజాయి రవాణాకు స్మగ్లర్లు పాల్పడ్డారు. రెండు కోట్ల విలువ చేసే 405 కేజీల గంజాయి, ఉన్న 22 బస్తాలను, బొలెరో వ్యాన్‌ను వదిలి గంజాయి స్మగ్లర్లు పరారయ్యారు. గంజాయి స్మగ్లర్లు కోసం అటవీ ప్రాంతంలో డ్రోన్ కెమెరా ద్వారా సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు గోకవరం పోలీసులు.

ముందు ఒరిస్సా రిజిస్ట్రేషన్.. వెనుక ఏపీ నెంబర్.. అనుమానంతో చెక్ చేస్తే షాక్..!
Ganja Seized In Gokavaram

Updated on: Dec 18, 2025 | 7:46 PM

పోలీసులు నిఘాతో గంజాయి స్మగ్లర్లు రోజురోజుకు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. అనుమానం రాకుండా సినీ పక్కీలో గంజాయి రవాణాకు సిద్దపడుతున్నారు. ఓ పాత వాహనాన్ని తీసుకుని దానికి పుష్ప సినిమా స్టైల్‌లో కవరింగ్ ఇచ్చారు. కలప అక్రమ రవాణాకు తయారు చేసిన లారీ మాదిరిగానే రంగులు వేసి వ్యాన్‌లో ఖాళీ బస్తాల మాదిరిగా 22 బస్తాలలో గంజాయిను తరలిస్తుండగా పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు. దీంతో చేసేదీలేక వ్యాన్ వదిలేసి, అటవీ ప్రాంతం వైపు పరుగులు తీశారు. రంగంలోకి దిగిన పోలీసులు అటవీ ప్రాంతం వైపు స్మగ్లర్ల కోసం ఆపరేషన్ గరుడ తో డ్రోన్ కెమెరా ద్వారా సెర్చ్ చేస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కామరాజుపేట శివారులో పుష్ప సినిమా తరహాలో గంజాయి రవాణాకు స్మగ్లర్లు పాల్పడ్డారు. రెండు కోట్ల విలువ చేసే 405 కేజీల గంజాయి, ఉన్న 22 బస్తాలను, బొలెరో వ్యాన్‌ను వదిలి గంజాయి స్మగ్లర్లు పరారయ్యారు. గంజాయి స్మగ్లర్లు కోసం అటవీ ప్రాంతంలో డ్రోన్ కెమెరా ద్వారా సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు గోకవరం పోలీసులు. వ్యాను డీటెయిల్స్ ద్వారా ఒరిస్సా నుంచి ఏపీలోని రాజమండ్రి వైపుగా వస్తుండగా, అటవీ శాఖ సిబ్బంది కంటపడింది. అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దీంతో కాపుకాసిన పోలీసులు వ్యాను ఆపేందుకు ప్రయత్నించారు. వ్యాను వదిలి దుండగులు పరారయ్యారు. పట్టుబడ్డ గంజాయి, బొలెరో వ్యాన్ సీజ్ చేసి గోకవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్మగ్లర్లు గంజాయి రవాణాకు అనుమానం రాకుండా వాహనాలకు ముందు ఒరిస్సా రిజిస్ట్రేషన్ నెంబర్ తో వెనుక ఏపీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఫ్లేటుతో స్మగ్లర్లు రవాణాను చేస్తున్నట్టుగా పోలీసులు చెబుతూన్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…