
గుంటూరు జిల్లా మంగళగిరిలోకి గండాలయ్య పేటకు చెందిన మైనర్ బాలికను ఇంట్లోకి వచ్చిన గుర్తు తెలియని యువకులు కిడ్నాప్ చేసి బైక్ పై తీసుకెళ్లారు. దాదాపు ఎనిమిది మంది యువకులు ఈ కిడ్నాప్ లో పాల్గొన్నారు. నాలుగు బైక్ లపై వచ్చి కిడ్నాప్ చేశారు.. బాలికను ఇంట్లోకి వచ్చిన తీసుకెళ్లడంతో పాటు అడ్డుకోబోయిన ఆమె తల్లిదండ్రులపై కూడా దాడికి యత్నించారు. దీంతో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సిసి కెమెరా విజువల్స్ పరిశీలించిన పోలీసులు రంగంలోకి దిగి కిడ్నాపర్స్ ను గుర్తించారు. రాత్రి కిడ్నాప్ చేయగా తెల్లవారేసరికి యువతిని కిడ్నాప్ చేసిన ప్రధాన నిందితుడిని గుర్తించి యువతితో పాటు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే మైనార్టీ తీరని ఆ యువతి తన ఇష్టంతోనే అతనితో వెళ్లినట్లు చెప్పింది.
మంగళగిరికే చెందిన రవితేజ గండాలయ్య పేటకు చెందిన ఇంటర్ చదువుతున్న యువతితో ప్రేమలో పడ్డాడు. కరాటే క్లాస్ ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అయితే బాలిక తల్లిదండ్రులు ఆమెను హెచ్చరించి విజయవాడలోని ఓ ప్రవేటు కాలేజ్ హాస్టల్ చేర్పించారు. అయితే వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో ఆ బాలిక తల్లిదండ్రులకు వద్దకు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న రవితేజ ఎలాగైనా ఆ బాలికను తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తన స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేసేందుకు ప్లాన్ వేశాడు.
సాయంత్రం ఆరు గంటల సమయంలో గండాలయ్యపేటలోని ఆమె ఇంటి వద్దకు స్నేహితులతో కలిసి వచ్చాడు. ఆమె ఇంటిలోకి వెళ్లి బాలికను బయటకు తీసుకొచ్చాడు. బైక్ పై ఎక్కించుకొని వెళ్లిపోయాడు. అడ్డుకోబోయిన తల్లిదండ్రులపై దాడికి యత్నించారు రవితేజ స్నేహితులు.. ఈ ఘటన కాలనీలో కలకలం రేపింది. బాలిక కిడ్నాప్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగి బాలిక కోసం గాలింపు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో బాలిక ఎక్కడుంతో తెలుసుకొని రవితేజను, బాలికను అదుపులోకి తీసుకున్నారు. మైనార్టీ తీరకపోవడంతో ఆమెను తల్లిదండ్రులకు అప్పగించారు. రవితేజ అతని స్నేహితులపై కేసు నమోదు చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..