పక్కపక్కనే ఇళ్లు.. అగ్గి పెట్టె కోసం గొడవ.. ఎంతకు తెగించావ్‌రా..?
గుంటూరు జిల్లా వేమూరు మండలం వెల్లబాడులో చిన్న అగ్గిపెట్టె వివాదం హత్యకు దారితీసింది. మద్యం మత్తులో ఉన్న ఇద్దరి మధ్య అగ్గిపెట్టె అడిగిన విషయంలో గొడవ జరగగా.. శరణ్ తేజ్ కత్తితో యోహానుపై దాడి చేశాడు. మెడపై తీవ్ర గాయం కావడంతో యోహాను ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. ఘటన అనంతరం నిందితుడు పరారయ్యాడు. కేసు నమోదు చేసిన వేమూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

చిన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. మాటలతో మొదలైన గొడవ కత్తితో దాడి వరకూ వెళ్లింది. ఈ దాడిలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇదంతా మద్యం మత్తులో జరగడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేమూరు మండలం వెల్లబాడుకు చెందిన యోహాను కూలీ పనులు చేస్తుంటాడు. అదే గ్రామానికి చెందిన శరణ్ తేజ్ యోహాను ఇంటి సమీపంలోనే నివసిస్తుంటాడు. అయితే రాత్రి ఇద్దరూ విడివిడిగా మద్యం సేవించి ఇంటి వద్దకు వచ్చారు. యోహాను వచ్చే సమయంలో శరణ్ తేజ్ ఇంటి వద్దే ఉన్నాడు. దీంతో యోహాను సిగరెట్ తాగేందుకు సిద్దమయ్యాడు. తన వద్ద అగ్గిపెట్టే లేకపోవడతో ఎదురుగా కనిపించిన శరణ్ తేజ్ ను అగ్గిపెట్టే అడిగాడు. యోహాన్ అగ్గిపెట్టే అడగడంతో శరణ్ తేజ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనను అగ్గిపెట్టే ఎందుకు అడిగావంటూ గట్టిగా ప్రశ్నించాడు.
అగ్గిపెట్టే అడిగితే ఎందుకు ఇవ్వవంటూ యోహను శరణ్ తేజ్ తో ఘర్షణ పడ్డాడు. దీంతో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. గట్టిగా కేకలు వేయడంతో ఆగ్రహంతో ఊగిపోయిన శరణ్ తేజ్ ఇంట్లోకి వెళ్లి కత్తి తీసుకొచ్చి యోహాన్ పై దాడి చేశాడు. మెడ వద్ద కత్తితో బలంగా పొడవడంతో ఒక్కసారిగా కిందపడియాడు.. దీంతో యోహాన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు స్థానికులు.. ఈ క్రమంలో మార్గ మద్యలోనే యోహాన్ అపస్మారక స్థితిలోకి వెళ్లాపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్దారించారు.
యోహాన్ పై దాడి చేసిన అనంతరం శరణ్ తేజ్ పారిపోయాడు. కేసు నమోదు చేసిన వేమూరు పోలీసులు దర్యాప్త చేస్తున్నారు. మద్యం మత్తులో చిన్న విషయంలో ఘర్షణ జరిగి ఒక వ్యక్తి హత్యకు గురికావడతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
