
తమిళనాడుకి చెందిన యువతి విశాఖపట్నంలో ఐటి సెజ్‌లో పనిచేస్తున్నారు. గత కొన్ని రోజులగా ఆమె మొబైల్‌కు గుర్తు తెలియని నెంబర్ నుంచి అసభ్య మెసేజ్‌లు మొదలయ్యాయి. నీలి చిత్రాలు కూడా పంపడం ప్రారంభమైంది. వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన ఆమె.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు సీఐ భవాని ప్రసాద్. మెసేజ్‌లు పంపిన మొబైల్‌ను గుర్తించి నిందితుడిని ట్రాక్ చేశారు. పెందుర్తి ప్రశాంత్ నగర్‌కు చెందిన డి అవినాష్‌గా గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేశారు. కోర్టులో హాజరపరచడంతో అవినాష్‌కు ఆరు రోజుల రిమాండ్ విధించింది కోర్ట్. ఈ నేపథ్యంలోనే ప్రజలు సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తతో ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా గుర్తు తెలియన వ్యక్తుల నుంచి ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా సైట్స్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే యాక్సెప్ట్ చేయకూడదని చెబుతున్నారు.
అపరిచిత వ్యక్తులపట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు. తెలియని వ్యక్తులతో సాన్నిహిత్యం పనికి రాదని, తెలియని లింక్స్‌ను క్లిక్ చేయవద్దని సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ K భవాని ప్రసాద్ పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ ఫిర్యాదుల కోసం సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ www.cybercrime.gov.in, లేదా టోల్ ఫ్రీ నెంబర్: 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేయలని తెలిపారు. నేరుగా విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా సంప్రదించాలని సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..